కదులుతున్న రైలు ఎక్కేందుకు జవాన్​ యత్నం.. నెట్టేసిన టీటీఈ.. రెండు కాళ్లు కట్​

author img

By

Published : Nov 17, 2022, 1:19 PM IST

tte pushed soldier

ఉత్తర్​ప్రదేశ్​ బరేలీ రైల్వే స్టేషన్​లో దారుణం జరిగింది. కదులుతున్న రైలును ఎక్కుతున్న ఓ జవాన్​ను టీటీఈ కిందకు తోసేశాడు. రైలు కిందపడి జవాన్ రెండు కాళ్లు తెగిపోయాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఉత్తర్​ప్రదేశ్ బరేలీలో ఘోరం జరిగింది. దిబ్రూగఢ్ నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్​ప్రెస్​ రైలు ఎక్కుతుండగా.. ఓ జవాన్​ను టీటీఈ కిందకు తోసేశాడు. ఈ క్రమంలో రైలు కింద పడిన సైనికుడి రెండు కాళ్లు తెగిపోయాయి. ప్రస్తుతం క్షతగాత్రుడు ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే స్టేషన్​లో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీటీఈపై చర్యలు తీసుకోవాలని సైనికులు, ప్రయాణికులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బరేలీ రైల్వేస్టేషన్​లో చాలా సేపు రాజధాని ఎక్స్​ప్రెస్​ రైలు నిలిచిపోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కదులుతున్న రైలును ఎక్కేందుకు ఓ జవాన్​ ప్రయత్నించాడు. ఇంతలో రైలులో ఉన్న టీటీఈ.. రైలు ఎక్కుతున్న జవాన్​ను కిందకు నెట్టేశాడు. రైలు కింద పడి.. జవాన్​ రెండు కాళ్లు తెగిపోయాయి. పోలీసులు బరేలీ రైల్వే స్టేషన్​కు చేరుకుని రైలును పంపించారు. పరారీలో ఉన్న నిందితుడిపై కేసు నమోదు చేసుకున్నారు. అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి: 279 మందిని చంపి.. రూ.11కోట్లు సంపాదించిన క్లర్క్.. అంతా 'నకిలీ' మాయ!

అక్రమ నిర్మాణం కేసులో కోర్టు షాక్.. సొంతంగా భవనాన్ని కూల్చేస్తున్న కేంద్రమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.