ETV Bharat / bharat

శ్రీవారి భక్తులకు శుభవార్త - ఫిబ్రవరి టికెట్ల బుకింగ్స్‌ - ఎప్పుడో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2023, 1:22 PM IST

Updated : Nov 19, 2023, 1:28 PM IST

TTD Tirumala Seva Tickets For February 2024
TTD Tirumala Seva Tickets For February 2024

TTD Tirumala Seva Tickets For February 2024 : వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్‌న్యూస్‌. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిజత సేవలు, వసతి గదుల కోటా, రూ.300 టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. ఏయే తేదీల్లో ఈ టికెట్లను విడుదల చేయనుందో ప్రకటించింది.

TTD Tirumala Seva Tickets For February 2024 : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు.. నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఆ స్వామి వారి సన్నిధిలో అడుగు పెట్టాలని చాలా మంది భక్తులు కోరుకుంటారు. అందుకే స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండపైకి వస్తుంటారు. అయితే.. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా, రూ.300 దర్శనం టికెట్లను టీటీడీ నవంబర్​లో రిలీజ్‌ చేస్తోంది. మరి.. ఏయే తేదీల్లో ఏయే టికెట్లను విడుదల చేస్తోందనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎలక్ట్రానిక్ డిప్ కోటా : ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవ (మొదటి గడప ఆర్జిత సేవ) ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. భక్తులు నవంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు.. అర్చన, అష్టదళపాదపద్మారాధన, సుప్రభాతం, తోమాల వంటి ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకునే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్పించింది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు.. ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీలోపు నగదును చెల్లించాల్సి ఉంటుంది. తరువాత ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ ఖరారు చేస్తుంది.

ఇంకా మరిన్ని సేవల టికెట్లు..
అర్జిత సేవల టికెట్లతో పాటు ఫిబ్రవరి నెలకు సంబంధించి మరికొన్ని రకాల సేవల టికెట్లను కూడా.. ఈ నవంబర్ నెలలోనే టీటీడీ రిలీజ్‌ చేస్తోంది. కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణకు సంబంధించిన టికెట్లను.. నవంబర్‌ 21వ తేదీన ఉదయం 10 గంటలకు టీడీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదేవిదంగా.. వర్చువల్ విధానంలో నిర్వహించే.. స్వామివారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలకు సంబంధించిన టికెట్లను ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవారి అంగప్రదక్షిణం టికెట్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తి ఎంతో మీకు తెలుసా..?

ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవాణి ట్రస్ట్‌ అండ్ అకామడేషన్‌ టికెట్లను ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగుల టికెట్లను 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. రూ.300 దర్శన టికెట్ల కోటాను 24వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. తిరుపతిలో భక్తులు వసతి గదులను బుక్‌ చేసుకోవాడానికి కోటాను 25వ తేదీన రిలీజ్‌ చేస్తామని, అదేవిధంగా.. తిరుమలలో గదుల బుకింగ్‌ కోటాను 26వ తేదీన విడుదల చేస్తామని టీటీడీ తెలియజేసింది.

TTD Alert : భక్తులకు అలర్ట్.. తిరుమల వెళ్తున్నారా? ఈ విషయం తెలియకుంటే ఇబ్బంది పడతారు!

TTD LATEST NEWS: తిరుమల నడకదారుల్లో ప్రతి భక్తుడి చేతికి కర్ర… కరుణా 'కర్ర' రెడ్డి చారిత్రాత్మక వింత నిర్ణయం

Last Updated :Nov 19, 2023, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.