ETV Bharat / bharat

చుట్టంగా వచ్చి ముగ్గురిని కిరాతకంగా చంపిన వ్యక్తి, ఆపై రక్తపు మడుగులో కూర్చొని

author img

By

Published : Aug 22, 2022, 10:49 PM IST

Updated : Aug 23, 2022, 6:46 AM IST

ఆశ్రయమిచ్చిన వారినే కడతేర్చాడు ఓ వ్యక్తి. నిద్రలో ఉన్న ముగ్గురిని మద్యం మత్తులో అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆపై రక్తపు మడులో కూర్చున్నాడు. ఝార్ఖండ్​లోని ఖుంటీ జిల్లాలో జరిగిందీ ఘటన.

Triple Murder in Khunti
triple murder in khunti people of same family killed with spade

Triple Murder in Khunti: చుట్టంగా వచ్చి ఆ కుటుంబానికి చెందిన ముగ్గరిని హతమార్చాడో దుండగుడు. ఆ ఏ మాత్రం భయం లేకుండా మృతదేహాల పక్కనే రక్తపు మడుగులో కూర్చున్నాడు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని ఖుంటీ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు హేమంత్​ పురి స్వస్థలం ముర్హులోని గజ్‌గావ్‌. గత శుక్రవారం అతడి బంధువులైన బీత్నా ముండా ఇంటికి వచ్చాడు. బీట్నా కుటుంబ సభ్యులంతా పొలం పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. తర్వాత బీత్నా ముండా(65), అతని కుమారుడు సుదా ముండా(25), నిందితుడు హేమంత్​ పరి, మరో బంధువు ఇంట్లో నిద్రపోయారు. బీత్నా మరో కుమారుడు సోమా ముండా, మరో బంధువు, నిద్రపోవడానికి అక్కడికి కొంత దూరంలో ఉన్న మరో ఇంటికి వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు హేమంత్​ పురి నిద్రలేచి.. ఇంట్లో పడుకున్న వారిని మద్యం మత్తులో పారతో కిరాతకంగా హతమార్చాడు. అనంతరం రక్తపు మడుగులో పార చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. ఉదయం పొలానికి వెళ్లే ముందు బీత్నా కుమారుడు సోమా ముండా ఇంటికి వచ్చాడు. మృతదేహాల మధ్య రక్తపు మడుగులో హేమంత్​ పురిని చూసి భయపడిపోయాడు. వెంటనే ఊళ్లో వాళ్లను పిలిచాడు. దీంతో గ్రామస్థులు అక్కడికి చేరుకుని నిందితుడిని కట్టిపడేశారు.

అయితే, గత శుక్రవారం వచ్చిన నిందితుడు హేమంత్, తనను ఎవరో చంపేస్తారని తరచూ బీత్నా కుటుంబ సభ్యులతో చెబుతుండేవాడు. దీంతో వారు తమ వద్దే ఉండమన్నారని హేమంత్​కు వారు సూచించారు. ఈ క్రమంలోనే అతడు హత్యలకు పాల్పడ్డాడు. చనిపోయిన ముడో వ్యక్తిని చియుర్​చపడ్​ గ్రామానికి చెందిన వికాస్ మహ్తోగా గుర్తించారు. మద్యం మత్తులోనే నిందితుడు ఈ హత్యలు చేశాడని ఖుంటీ పోలీస్​ స్టేషన్ ఇంచార్జ్ కామేశ్వర్ కుమార్ తెలిపారు. మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం పంపించామని చెప్పారు. హత్యచేయడానికి ఉపయోగించిన పారను పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: డబ్బు ఆశతో క్షుద్రపూజలు, భార్యకు అందరిముందు నగ్నంగా స్నానం చేయించి

మద్యం మత్తులో స్నేహితుల అరాచకం, మలద్వారంలో గ్లాసు చొప్పించి

Last Updated : Aug 23, 2022, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.