ETV Bharat / bharat

'ఎల్​డీఎఫ్​పై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు'

author img

By

Published : May 2, 2021, 4:03 PM IST

కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ విజయం దిశగా దుసుకెళ్తున్న నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై పార్టీ ఎప్పుడూ పోరాడుతుందన్నారు.

Sitaram Yechury
సీతారాం ఏచూరి

కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​పై స్పష్టమైన మెజారిటీతో దూసుకెళ్తున్న క్రమంలో రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఎల్​డీఎఫ్​ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

" ఎల్​డీఎఫ్​ ప్రభుత్వంపై నమ్మకం ఉంచినందుకు కేరళ ప్రజలకు కృతజ్ఞతలు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రజల్లో పార్టీపై నమ్మకం పెరిగింది. కొవిడ్ ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం .. ప్రపంచానికి కేరళ మోడల్ ను అందించింది. సీపీఎం నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ మరోసారి దృఢనిశ్చయంతో పనిచేస్తుంది."

-- సీతారాం ఏచూరి, సీపీఎం జాతీయ కార్యదర్శి

కరోనాతో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు ఏచూరి. దేశప్రజలంతా ఏకమై మహమ్మారిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్ డీఎఫ్ ప్రభుత్వం.. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే అరుదైన రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది. 1970 తర్వాత కేరళ ప్రజలు వరుసగా రెండోసారి ఒకే పార్టీకి ఓటు వేయలేదు.

ఇదీ చదవండి : కేరళలో ఒక్కచోటా ఆధిక్యంలో లేని ఎన్​డీఏ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.