ETV Bharat / bharat

Yerra Gangi Reddy: వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు.. అప్పటిలోపు లొంగిపోవాలని..

author img

By

Published : Apr 27, 2023, 7:58 PM IST

gangireddy
gangireddy

11:27 April 27

మే 5 వరకు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డికి హైకోర్టు ఆదేశం

వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు.. మే 5లోపు లొంగిపోవాలని..

Yerra Gangi Reddy Bail Cancelled: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో A1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ రద్దైంది. మే 5లోగా హైదరాబాద్ లోని.. సీబీఐ కోర్టులో లొంగిపోకపోతే అదుపులోకి తీసుకోవాలని.. సీబీఐని తెలంగాణ హైకోర్ట్‌ ఆదేశించింది. వివేకా హత్య కేసులో A1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి... కొంతకాలంగా బెయిల్ పై ఉన్నారు. 2019 మార్చి 28న అప్పటి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌.. ఎర్ర గంగిరెడ్డిని అరెస్ట్ చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఏర్పాటు చేసిన సిట్.. సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో ఎర్ర గంగిరెడ్డికి 2019 జూన్ 27న పులివెందుల కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం వివేకా హత్య కేసు.. దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. తెలిపింది. CBI వాదనలు పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు.. గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2021 అక్టోబర్ 26న పులివెందుల కోర్ట్‌లో మొదటి ఛార్జ్‌షీట్‌ వేసిన CBI.. ఎర్రగంగిరెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చింది. 2019 ఫిబ్రవరి 10న.. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరిని ఇంటికి పిలిపించిన ఎర్ర గంగిరెడ్డి.. వివేకా హత్య ప్రణాళిక గురించి చెప్పినట్లు CBI తెలిపింది. బెంగళూరు స్థలం..సెటిల్మెంట్ డబ్బులో వివేకా తనకు వాటా ఇవ్వలేదంటూ.. హత్యకు పురమాయించినట్లు పేర్కొంది. వివేకాను హత్య చేస్తే.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 40 కోట్ల రూపాయలు సుపారీ ఇస్తారని ఎర్రగంగిరెడ్డి నమ్మబలికారని వివరించింది. దీని వెనుక.. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఉన్నట్లు ఎర్రగంగిరెడ్డే తనకు చెప్పారని కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కూడా.. వాంగ్మూలం ఇచ్చారు.

హత్య తర్వాత సాక్ష్యాల ధ్వంసానికీ ప్రణాళిక వేశామని, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి,శివశంకర్‌రెడ్డి అండగా ఉంటారని... నిందితులకు ఎర్ర గంగిరెడ్డి భరోసా ఇచ్చినట్లు CBI వెల్లడించింది. హత్య తర్వాత వివేకా బెడ్ రూమ్, బాత్ రూమ్‌లో.. సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడంలో ఎర్ర గంగిరెడ్డిదీ కీలక పాత్రని సీబీఐ.. వెల్లడించింది. 30 ఏళ్ల పాటు వివేకాకు ప్రధాన అనుచరుడుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి.. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వెన్నుపోటు పొడవడం ప్రారంభించాడని.. సీబీఐ పేర్కొంది. ఎర్ర గంగిరెడ్డి సూచనల మేరకే సునీల్ యాదవ్ దస్తగిరికి.. కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలిపింది. ఐతే.. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలంటే ఎర్రగంగిరెడ్డిని ప్రశ్నించాలని..CBI భావిస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి మే 5లోగా.. లొంగిపోవాలా లేదా అనే అంశంపై న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.