ETV Bharat / bharat

Telangana Cabinet Expansion Tomorrow : రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 8:01 PM IST

Updated : Aug 23, 2023, 8:57 PM IST

CM KCR
KCR

19:53 August 23

రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం

Telangana Cabinet Expansion Tomorrow : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌ సర్కార్ కీలక నిర్ణయాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలోనే రేపు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖాయమైంది. అమాత్యుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, రంగారెడ్డి కీలక గులాబీ నేత పట్నం మహేందర్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సమక్షంలో ప్రమాణం చేయనున్నారు. రెండోసారి సీఎం కేసీఆర్‌ అధికారం చేపట్టాక.. రెండోసారి విస్తరణ చేపడుతున్నారు.

Patnam Mahender Reddy As Cabinet Minister : ఆరోగ్యశాఖ మంత్రిగా రేపు మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక ఖాళీ ఉంది. కేబినెట్ నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఆ ఖాళీ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రాజకీయ అంశాలు దృష్టిలో పెట్టుకొని దీనిని భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తాండూరులో ప్రస్తుత ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. ఈమేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కి సమాచారం వెళ్లినట్లు తెలిసింది.

Thatikonda Rajaiah Crying for MLA Ticket : కార్యకర్తల ముందే బోరున విలపించిన MLA రాజయ్య.. వీడియో వైరల్

2018 శాసనసభ ఎన్నికల్లో వికారాబాద్‌ జిల్లా తాండూరులో భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డిపై.. కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. అనంతరం జరిగిన కొన్ని పరిణామాలతో పైలట్‌ రోహిత్‌రెడ్డి గులాబీ తీర్థం తీసుకున్నారు. అప్పటినుంచి నియోజకవర్గంలో ఇరువురి నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇదే విషయమై పార్టీ అదిష్ఠానికి అనేక సార్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే పట్నం మహేందర్‌రెడ్డికి.. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ పదవిని గులాబీ పార్టీ కట్టబెట్టింది.

అనంతరం కొద్దికాలం సైలెంట్‌గా ఉన్న ఇరువురు నేతలు.. ఇటీవలే మరోసారి ఇరువురు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. పైలట్‌ రోహిత్‌రెడ్డికి (Pilot Rohit Reddy) బీఆర్‌ఎస్‌ టికెట్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు జోరుగా వినిపించాయి. ఇదే జరిగితే ఆయన భార్య వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీత మహేందర్‌రెడ్డి కూడా పార్టీ మారి.. అసెంబ్లీ లేదా లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని మహేందర్‌ రెడ్డి ఖండించారు. ఈయన తమ్ముడు పట్నం నరేందర్‌రెడ్డి ప్రస్తుతం కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి మొదటి నుంచి సేవలు అందిస్తోన్న మహేందర్‌ రెడ్డికి మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు అధిష్ఠానం నిర్ణయించింది.

BRS MLAs Final Candidates List 2023 : బీఆర్​ఎస్​ గెలుపు గుర్రాలివే.. తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్!

BRS MLA Tickets Telangana 2023 : సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు పెద్దపీట.. ఏడుగురు మహిళలకు ఛాన్స్​

Last Updated :Aug 23, 2023, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.