ETV Bharat / bharat

'భారత్​లో పెట్టుబడులు పెట్టండి.. 50శాతం ఆర్థిక సహకారం అందిస్తాం'

author img

By

Published : Jul 28, 2023, 2:17 PM IST

Updated : Jul 28, 2023, 2:34 PM IST

Semiconductor Manufacturing In India : భారత్​లో సెమీకండక్టర్ల తయారు చేసే కంపెనీలకు భారత ప్రభుత్వం బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. అలాంటి పరిశ్రమలకు 50 శాతం ఆర్థిక సహకారం అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సెమీ కండక్టర్ పరిశ్రమపై అవగాహన పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో మోదీ పాల్గొన్నారు.

Semiconductor Manufacturing In India
Semiconductor Manufacturing In India

Semiconductor Manufacturing In India : భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి తరలివచ్చే పరిశ్రమలకు 50 శాతం ఆర్థిక సహకారం అందించనున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సెమీకాన్ ఇండియా 2023 ప్రదర్శనను.. మోదీ ప్రారంభించారు. 2 రోజుల గుజరాత్‌ పర్యటనలో ఉన్న మోదీ.. సెమీ కండక్టర్ పరిశ్రమపై అవగాహన పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెమీకండక్టర్‌ తయారీదారులకు భారత ప్రభుత్వం ఎర్ర తివాచీ పరుస్తున్నట్లు ప్రధాని వివరించారు. చిప్‌సెట్‌ డిజైనింగ్‌ పరిశ్రమల పురోగాభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

  • #WATCH | At SemiconIndia Conference 2023, PM Narendra Modi says, "Today, the world is becoming a witness to Industry 4.0. Whenever the world has undergone any industrial revolution, its foundation has been the aspirations of the people of any region. This was the relation between… pic.twitter.com/cCeLLHwIGb

    — ANI (@ANI) July 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Semiconductor Industry In India : సెమీకాన్ ప్రోగ్రామ్‌ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. భారత్‌లోని 300 కాలేజీల్లో సెమీకండక్టర్‌ తయారీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ప్రదర్శనలో ఏర్పాటు చేసిన సాంకేతిక పరికాలను ఆయన పరిశీలించారు. సెమీకండక్టర్ చిప్, డిస్‌ప్లే ఫ్యాబ్, చిప్ డిజైన్, అసెంబ్లింగ్ రంగాల్లోని నిపుణులు భారత్‌లో పెట్టుబడి అవకాశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. దేశంలో సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడి అవకాశాలను పెంచే ఉద్దేశంతో.. పరిశ్రమలు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన దేశ పారిశ్రామిక రంగానికి దోహదం చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఫాక్స్‌కాన్, మైక్రాన్, AMD, IBM, మార్వెల్, వేదాంత, లామ్ రీసెర్చ్ సహా ప్రముఖ కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి.

AMD రూ. 3,290 కోట్ల పెట్టుబడి..
ప్రముఖ చిప్‌ డిజైనింగ్‌ సంస్థ AMD.. భారత్‌లో రూ. 3,290 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. గుజరాత్‌ గాంధీనగర్‌లో జరుగుతున్న సెమీకాన్‌ ఇండియా- 2023 సదస్సుకు హాజరైన AMD ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ మార్క్‌ పేపర్‌మాస్టర్‌ ఈ మేరకు ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో పెట్టే ఈ పెట్టుబడితో బెంగుళూరులో పరిశోధన, అభివృద్ధి క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్టు.. ఆయన వివరించారు. బెంగుళూరులో స్థాపించే స్థాపించే ఈ క్యాంపస్‌.. తమ సంస్థకు సంబంధించి ప్రపంచలోనే అతి పెద్దదని మార్క్‌ తెలిపారు. ఈ క్యాంపస్‌ ద్వారా.. 2028 నాటికి 3,000 ఇంజనీర్లకు అదనంగా ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Last Updated : Jul 28, 2023, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.