ETV Bharat / bharat

దివ్యాంగుల సాహసం.. పర్వతారోహణలో ప్రపంచ రికార్డు!

author img

By

Published : Sep 13, 2021, 10:19 AM IST

ఎనిమిది మంది దివ్యాంగులు ప్రపంచ రికార్డు సాధించారు. 15 వేల అడుగులకుపైగా ఎత్తు ఉన్న మంచుకొండపైకి చేరుకున్నారు. వీరికి భారత సైన్యానికి చెందిన ప్రత్యేక విభాగాలు సహకరించాయి.

specially abled reaches kumar post
కుమార్ పోస్ట్

పేరుకే వారు దివ్యాంగులు... మనోధైర్యంలో అందరినీ మించినోళ్లు... వేల అడుగుల ఎత్తులోనూ సడలని పట్టుదలతో ముందడుగు వేశారు... ప్రపంచ రికార్డును దాసోహం చేసుకున్నారు.

Kumar Post specially-abled people
జవానును ఆలింగనం చేసుకుంటున్న దివ్యాంగుడు

ఆదివారం సియాచిన్ హిమానీనదంలో (siachen glacier) ఉన్న 15,632 అడుగుల ఎత్తైన కుమార్ పోస్ట్​కు (kumar post siachen) ఎనిమిది మంది దివ్యాంగులు చేరుకున్నారు. ప్రాణాలను హరించే చల్లటి గాలులు, ఊపిరి కూడా సరిగా తీసుకునే అవకాశం లేని పరిస్థితుల్లో గొప్ప ధైర్యసాహసాలను ప్రదర్శించారు.

Kumar Post specially-abled people
పర్వతారోహకుల క్లైంబింగ్..
Kumar Post specially-abled people
ఎత్తైన ప్రాంతంలో ఇలా...

'ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్' పేరుతో ఈ పర్వతారోహణ కార్యక్రమం చేపట్టారు. దీనికి భారత సైన్యానికి (Indian Army) చెందిన ప్రత్యేక విభాగాలు సహకరించాయి. ప్రత్యేక దళాల మాజీ సభ్యులతో కూడిన 'క్లా గ్లోబల్' విభాగం ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్​ (Blue Freedom Operation) విజయంలో కీలకంగా వ్యవహరించిందని.. ఆర్మీ నార్తర్న్ కమాండ్ వెల్లడించింది.

Kumar Post specially-abled people
సైనికులతో పర్వతారోహకులు

ఇదీ చదవండి: దేశంలో కరోనా తగ్గుముఖం- కొత్త కేసులు ఎన్నంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.