ETV Bharat / bharat

ఈపీఎఫ్​ చందా వడ్డీపై పన్ను అందుకే..

author img

By

Published : Feb 5, 2021, 10:20 AM IST

Updated : Feb 5, 2021, 12:37 PM IST

ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువగా ఈపీఎఫ్ చందా జమ చేస్తే.. వడ్డీ వసూలు చేయాలని కేంద్రం బడ్జెట్​లో ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన వెనకున్న కారణాలు ఏమిటి? దీనితో ఎవరిపై ప్రధానంగా ప్రభావం పడనుంది? అనే వివరాలు ఇలా ఉన్నాయి.

Tax burden on EPF contribution
ఈపీఎఫ్​ వడ్డీపై పన్ను భారం

ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలో (ఈపీఎఫ్​) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేస్తే.. దాని ద్వారా లభించే వడ్డీపై పన్ను విధించాలని ఇటీవల బడ్జెట్​లో ప్రతిపాదించింది కేంద్రం. దీనికి బలమైన కారణమే ఉంది. అధిక నికర విలువ గల వ్యక్తుల (హెచ్​ఎన్​ఐ)కు చెందిన 1.2 లక్షల ఈపీఎఫ్ ఖాతాల్లో 2018-19 ఆర్థిక సంవత్సరానికి పోగుబడిన మొత్తం రూ.62,500 కోట్లు. ఇందులో ఒక ఖాతాలోనే రూ.103 కోట్లు ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. సాధారణ ఉద్యోగులకు మేలు చేకూర్చేందుకు చందాతో పాటు వడ్డీకి కూడా మినహాయింపు ఇస్తుంటే అది.. హెచ్​ఎన్ఐల రూపంలో పక్క దారి పడుతోందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే రూ.2.5 లక్షల మొత్తం వరకు చెల్లించే చందాపై వడ్డీకి మినహాయింపు ఇచ్చి, మిగతా వడ్డీపై సదరు చందాదారు వార్షికాదాయం ఆధారంగా వర్తించే శ్లాబు ప్రకారం.. పన్ను విధించాలని ఆర్థిక శాఖ ప్రతిపాదిచింది., 2018-19లో మొత్తం 4.5 కోట్ల మంది ఈపీఎఫ్​ఓ చందాదారులు ఉండగా, ఇందులో 1.23 లక్షల మంది హెచ్ఎన్​ఐలు. వీరు ప్రతి నెలా పెద్ద మొత్తంలో ఈపీఎఫ్​ చందా చెల్లిస్తుండటం వల్ల అధిక మొత్తంలో వడ్డీ వీరికే అందుతోంది.

ఒక హెచ్​ఎన్​ఐ ఖాతాలో రూ.103 కోట్లు మరో రెండు ఖాతాల్లో రూ.86 కోట్లు పోగైంది. తొలి 20 హెచ్​ఎన్​ఐ ఖాతాల్లనే రూ.825 కోట్లు జమైంది. తొలి 100 హెచ్​ఎన్​ఐ ఖాతాల్లో మొత్తం రూ.2 వేల కోట్లు ఉన్నట్లు అంచనా.

ఏప్రిల్​ 1 నుంచి

హెచ్​ఎన్​ఐల సగటు ఖాతా మొత్తం రూ.5.92 కోట్లు ఉంది. దీనిపై ఏడాదికి రూ.50.3 లక్షల చొప్పున ఇప్పటివరకు పన్ను రహిత వడ్డీ లభిస్తోంది. ఏప్రిల్​ 1 నుంచి కొత్తగా జమయ్యే మొత్తాలకు మాత్రమే నూతన ప్రతిపాదన వర్తిస్తుంది. సాధారణ ఈపీఎఫ్​, జీపీఎఫ్​ చందాదారులకు దీని వల్ల ఇబ్బంది ఉండదని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు.

ఇదీ చడంవడి:క్యూ3లో 7% తగ్గిన ఎస్​బీఐ నికర లాభం

Last Updated : Feb 5, 2021, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.