ETV Bharat / bharat

రూ.9 వేల కోసం వేధింపులు.. వ్యాపారి ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Mar 2, 2021, 10:55 PM IST

అప్పుల వేధింపులతో అవమానాన్ని భరించలేక ఓ వ్యక్తి నడిరోడ్డుపైనే ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

Man sets himself ablaze over alleged harassment of debt
అప్పుల వేధింపులు తాళలేక.. నడిరోడ్డుపైనే ఒంటికి నిప్పు

రోజురోజుకూ పెరిగిపోతున్న అప్పుల వేధింపులను భరించలేక.. తమిళనాడులో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై ఒంటికి నిప్పుపొట్టుకుని బలవన్మరణానికి యత్నించాడు. కోయంబత్తూర్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం, ఒంటికి నిప్పంటించుకున్న సీసీటీవీ దృశ్యాలు

ఏం జరిగిందంటే?

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తమరైకుళంకు చెందిన విజయకుమార్.. జయప్రకాశ్​ వద్ద రూ.20వేలు అప్పుగా తీసుకున్నాడు. మూణ్నెళ్ల తర్వాత జయప్రకాశ్​కు రూ. 10వేలు, అతని భార్యకు మరో వెయ్యి రూపాయలు ఇచ్చాడు విజయ్. అయితే.. మిగిలిన సొమ్ము కోసం జయప్రకాశ్​ బెదిరించాడని తెలిసింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఓ టీ దుకాణం వద్ద వాగ్వాదం జరగ్గా.. విజయ్​పై జయప్రకాశ్​ ఉమ్మివేసినట్టు సమాచారం. ఈ అవమానాన్ని భరించలేని విజయ్ అక్కడే ఒంటికి నిప్పంటించుకున్నాడు. టీ షాపు యజమాని మంటలను ఆర్పగా.. జయప్రకాశ్​ పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన విజయ్​ను కోయంబత్తూర్​ ఆస్పత్రికి తరలించారు. పరారైన జయప్రకాశ్​ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: కీలక నేతల అధ్యక్షతన కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.