ETV Bharat / bharat

స్నేహితునితో గొడవ పెట్టుకొని చెవికొరికేశాడు!

author img

By

Published : Jul 3, 2021, 9:03 PM IST

ఇద్దరు కార్మికుల మధ్య జరిగిన గొడవ కారణంగా.. ఓ వ్యక్తి మరో అవతలి వ్యక్తి చెవిని కొరికేసిన ఘటన.. తమిళనాడులో జరిగింది. చెవి కొరుకుతుండగా ఆపేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సైతం గాయపరిచాడు.

Man who bit his friend's ear arrested
స్నేహితునితో గొడవ పెట్టుకుని.. చెవికొరికేసి పైశాచికం..

టైల్స్ పరిశ్రమలో పనిచేసే కార్మికుల మధ్య చెలరేగిన వివాదం.. ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తమిళనాడు మాయిలాదుత్తురై ప్రాంతానికి చెందిన శివకుమార్, చంద్రు అనే వ్యక్తులు స్నేహితులు. వీరిద్దరూ అనుకోకుండా జూన్ 30న గొడవపడ్డారు. దీనిపై జులై 1న గ్రామపెద్దలు రాజీ కుదిర్చారు.

కానీ.. వారి మధ్య అదేరోజు మళ్లీ గొడవ జరిగింది. దీనితో తీవ్ర ఆగ్రహానికి లోనైన చంద్రు.. శివకుమార్ కుడి చెవిని కొరికేశాడు. పక్కనే ఉన్న శివకుమార్ బంధువు కార్తికేయన్ వారిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ.. అతనిపైనా కర్రతో దాడి చేశాడు. దీనితో కార్తికేయన్ తలకు తీవ్ర గాయమైంది.

Man who bit his friend's ear arrested
సగం తెగిపోయిన చెవి

చెవి తెగిపడిపోయిన శివకుమార్​ను ప్రథమ చికిత్స అనంతరం.. మెరుగైన వైద్య కోసం తంజావూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చంద్రుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.