ETV Bharat / bharat

'ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముసాయిదా'

author img

By

Published : Jul 9, 2021, 3:00 PM IST

Sushil Chandra
సుశీల్​ చంద్ర

జమ్ముకశ్మీర్​లోని నియోజకవర్గాల పునర్విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్​ చంద్ర. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముసాయిదా నివేదిక సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.

జమ్ముకశ్మీర్​లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా అక్కడ పర్యటిస్తోంది డీలిమిటేషన్​ కమిషన్​. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్​ సుశీల్​ చంద్ర. నియోజకవర్గాలు, జిల్లాల సరిహద్దులు సరిగా లేవని, దాంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, సిఫారసులను పరిగణనలోకి తీసుకుని ముసాయిదా నివేదికను రూపొందిస్తామని.. దానిని పబ్లిక్​ డొమైన్​లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్​విభజనపై తుది ముసాయిదా రూపొందిస్తామన్నారు.

1981లో తొలిసారి పూర్తి స్థాయి డీలిమిటేషన్​ కమిషన్​ ఏర్పాటు చేశారని.. అయితే ఆ కమిషన్​ దాదాపు 14 ఏళ్ల తర్వాత 1995లో నివేదికను సమర్పించిందన్నారు సుశీల్​ చంద్ర. అప్పట్లో 1981 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందించడం వల్ల పునర్విభజనకు వీలుపడలేదని గుర్తు చేశారు. 1995 నాటికి జమ్ముకశ్మీర్​లో 12 జిల్లాలే ఉన్నాయని.. ఆ సంఖ్య ఇప్పుడు 20కు పెరిగిందన్నారు. మండలాల సంఖ్య​ కూడా 58 నుంచి 270కు పెరిగిందని.. నియోజకవర్గ సరిహద్దులు ఒకదానికితో ఒకటి కలిసిపోయాయని ఎన్నికల కమిషనర్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ట్విట్టర్ యూజర్​కు మోదీ బర్త్​డే విషెస్- నెటిజన్ల ఆశ్చర్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.