ETV Bharat / bharat

'ఆ ఆర్డినెన్స్​లు.. అధికార దుర్వినియోగానికి నిదర్శనం'

author img

By

Published : Nov 18, 2021, 4:31 PM IST

Updated : Nov 18, 2021, 4:40 PM IST

కేంద్ర దర్యాప్తు సంస్థల డైరెక్టర్ల పదవీ కాలంపై ఇటీవల కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్​లను (Randeep Surjewala News) సవాల్​ చేస్తూ కాంగ్రెస్​ నేత రణ్​దీప్​ సుర్జేవాలా సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ ఆర్డినెన్స్​లు.. అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ఆరోపించారు.

randeep surjewala news
రణ్​దీప్​ సుర్జేవాలా

ఇటీవల ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలానికి సంబంధించి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్​లను (Randeep Surjewala News) తప్పుపడుతూ కాంగ్రెస్​ నేత రణ్​దీప్​ సుర్జేవాలా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈనెల 14న తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్​ల అమలును (Randeep Surjewala News) తాత్కాలికంగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆర్డినెన్స్​లు అధికార దుర్వినియోగానికి ఉదాహరణగా నిలుస్తున్నాయని.. దర్యాప్తు సంస్థల స్వతంత్రతపై న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘించినట్లే అని ఆరోపించారు.

"ఈ ఆర్డినెన్స్​లకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కారణం అడిగితే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము అంటారు. కానీ నిజానికి ఈ నిర్ణయం వారి సొంతప్రయోజనాల కోసం తీసుకున్నది. ఇది దర్యాప్తు సంస్థల స్వాతంత్ర్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది."

-రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ నేత

కేంద్రం నిర్ణయాన్ని తప్పుపడుతూ తృణమూల్​ కాంగ్రెస్​ నేత, ఎంపీ మోహువా మోయిత్రా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

ఈనెల 14న సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీల కాలంపై ఉన్న నిబంధనలను సడలిస్తూ.. కేంద్రం రెండు ఆర్డినెన్స్​లను జారీ చేసింది. వీటి అమలు ద్వారా సంబంధిత దర్యాప్తు సంస్థల డైరెక్టర్ల తొలి రెండేళ్ల పదవీ కాలం కాకుండా మరో మూడేళ్ల పాటు వారి సేవలను కేంద్రం పొడిగించవచ్చు.

పదవీ కాలం పొడిగింపు..

ఈడీ డైరెక్టర్​గా సంజయ్​ మిశ్ర పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం బుధవారం ఆదేశాలు చేసింది. మరో ఏడాది పాటు మిశ్ర ఈడీ డైరెక్టర్​గా కొనసాగుతారని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి : 'దెయ్యం భయంతో కానిస్టేబుల్​ ఆత్మహత్య- ఇంట్లో ఉరేసుకుని...'

Last Updated :Nov 18, 2021, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.