ETV Bharat / bharat

'జాతీయ క్రీడగా హాకీ' పిటిషన్​ను తిరస్కరించిన సుప్రీం

author img

By

Published : Sep 7, 2021, 9:41 PM IST

మన జాతీయ క్రీడ(national game of india) ఏది అనగానే టక్కున గుర్తొచ్చేది హాకీ. కానీ, హాకీ కాదని ఎంత మందికి తెలుసు? ఇంతకి మన జాతీయ క్రీడా ఏమిటి? హాకీని జాతీయ క్రీడగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్​ను సుప్రీం కోర్టు ఎందుకు తిరస్కరించింది?

national-game
భారత జాతీయ క్రీడ ఏది?

జాతీయ క్రీడగా హాకీని(national game of india) ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను విచారించేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. ఈ విషయంలో కోర్టు ఏమీ చేయలేదని స్పష్టం చేసింది. పిటిషన్​ను ఉపసంహరించుకోవాలని లేదంటే తామే కొట్టేస్తామని పిటిషనర్​కు సూచించింది.

దేశానికి జాతీయ జంతువు ఉన్నట్లుగానే.. జాతీయ క్రీడ లేదని, హాకీని నేషనల్​ గేమ్​గా ప్రకటించాలని కోరుతూ సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు పిటిషనర్​ విశాల్​ తివారీ. హాకీ గతంలో దేశ గౌరవాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లినా.. సరైన స్థానం లభించలేదని పేర్కొన్నారు. క్రికెట్​తో పోలిస్తే.. హాకీకి ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించటం లేదని కోర్టుకు తెలిపారు.

"భారత్​లో హాకీ చరిత్ర మొత్తం దేశానికి గర్వకారణం. హాకీలో భారత్​ ఆధిపత్యం చెలాయించింది. కానీ కొన్నాళ్లుగా వెనకబడింది. 41 ఏళ్లుగా ఒలింపిక్​ మెడల్​ సాధించకపోవటం దురదృష్టకరం. 2020 టోక్యో ఒలిపింక్స్​లో దేశం కాంస్య పతకం సాధించింది. "

- విశాల్​ తివారీ, పిటిషనర్​.

తివారీ పిటిషన్​ను పరిశీలించిన జస్టిస్​ యూయూ లలిత్​, జస్టిస్​ ఎస్​ రవిందర్ భట్​, జస్టిస్​ బేలా త్రివేదిల సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని పేర్కొంది. ' ప్రజల్లో చైతన్యం ఉండాలి. మేరీ కోమ్​ లాంటి వాళ్లు కష్టాలను ఎదురొడ్డి పైకి వచ్చారు. కోర్టులు ఏమీ చేయలేవు,' అని తెలిపింది.

సాధారణంగా జాతీయ క్రీడ.. హాకీ అనే ప్రజలు నమ్ముతారు. కానీ, భారత జాతీయ క్రీడ హాకీ కాదు. నిజానికి దేశానికి జాతీయ క్రీడా అంటూ ఏమీ లేదు. సహ చట్టం కింద ఓ కార్యకర్త అడగగా.. ఇంతకాలం కేంద్రం ఏ క్రీడను జాతీయ క్రీడగా ప్రకటించలేదని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ తెలిపింది.

ఇదీ చూడండి:మెరిసిన పేదింటి విద్యా కుసుమం- ఒకేరోజు 20 గోల్డ్​ మెడల్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.