ETV Bharat / bharat

కేంద్ర ప్రభుత్వంలో 1207 ఉద్యోగాలు.. ఇంకెందుకు ఆలస్యం.. అప్లై చేసుకోండిలా..

author img

By

Published : Aug 3, 2023, 11:09 AM IST

Central Government Jobs 2023 : కేంద్రప్రభుత్వ పరిధిలోని వివిధ సంస్థల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్​-సీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్​-డీ పోస్టుల భర్తీకి​ సంబంధించి నోటిఫికేషన్​ విడుదల అయింది. మొత్తం 1207 ఖాళీలకు ఈ నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించింది స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​. మరి దరఖాస్తు, చివరితేదీ ఎప్పుడు, అప్లికేషన్​ ఫీజు ఎంత, సిలబస్​ ఏంటి, జీతభత్యాలు ఎలా ఉంటాయి వంటి తదితర వివరాలు మీ కోసం.

SSC Stenographer Notification 2023 Last Date To Apply Exam Date Full Details In Telugu
కేంద్రప్రభుత్వంలో 1207 స్టెనోగ్రాఫర్ ఖాళీలు.. అప్లై చివరితేదీ ఎప్పుడంటే..

SSC Stenographer Vacancy 2023 : కేంద్రప్రభుత్వం పరిధిలోని వివిధ సంస్థల్లో ఉద్యోగిగా స్థిరపడాలని కలలు కనేవారికి శుభవార్త చెప్పింది​ స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​(ఎస్​ఎస్​సీ). కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో ​స్టెనోగ్రాఫర్ గ్రేడ్​-సీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్​-డీ కింద మొత్తం 1207 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి బుధవారం ఓ నోటిఫికేషన్​ను​ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 23లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

ఖాళీలు..

  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్​-సీ- 93 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్​-డీ- 1114

ముఖ్యమైన తేదీలు..

  • అప్లికేషన్ స్వీకరణ ప్రారంభ తేదీ- 2023 ఆగస్టు 2
  • చివరితేదీ- 2023 ఆగస్టు 23(రాత్రి 11:00 వరకు)
  • అప్లికేషన్​ ఫామ్​ లేదా ఆన్​లైన్​ చెల్లింపుల్లో ఏమైనా తప్పులు ఉంటే 24, 25 తేదీల్లో రాత్రి 11 గంటల వరకు సరిదిద్దుకోవచ్చు.

వీరు మాత్రమే అర్హులు..
SSC Stenographer Eligibility : ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్​తో పాటు స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

దరఖాస్తు రుసుము..

  • జనరల్​, ఓబీసీ అభ్యర్థులకు- రూ.100/-
  • ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగులు, ఎక్స్​-సర్వీస్​మెన్​, అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్​ ఫీజు లేదు.

వయో పరిమితి​..

  • స్టెనోగ్రాఫర్​(గ్రేడ్​-సీ)- 2023 ఆగస్టు 1 నాటికి 18-30 సంవత్సరాలలోపు ఉండాలి.
  • స్టెనోగ్రాఫర్​(గ్రేడ్​-డీ )- 18-27 ఏళ్లలోపు ఉండాలి.

వయోపరిమితి సడలింపులు..

  • ఎస్​సీ/ఎస్​టీ- 5 ఏళ్లు
  • ఓబీసీ- 3 ఏళ్లు
  • దివ్వాంగులు(అన్​రిజర్వ్​డ్​)- 10 ఏళ్లు
  • దివ్వాంగులు(ఓబీసీ)- 13 ఏళ్లు
  • దివ్వాంగులు(ఎస్​సీ/ఎస్​టీ)- 15 ఏళ్లు
  • ఎక్స్​-సర్వీస్​మెన్​- 3 ఏళ్లు

పరీక్ష తేదీలు..
SSC Stenographer Exam Dates : 2023 అక్టోబరు 12,13 తేదీల్లో.

పరీక్ష విధానం..

  • రాత పరీక్ష
  • స్కిల్​ టెస్టు

SSC Steno Selection Process : సీబీటీ లేదా ఆన్​లైన్​ విధానంలో వివిధ షిఫ్టుల్లో పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో పాసైన అభ్యర్థులను స్టెనో స్కిల్​ టెస్టుకు పిలుస్తారు. 10 నిమిషాల వ్యవధిలో నిమిషానికి వంద హిందీ/ఇంగ్లిష్​ పదాలు టైప్​ చేసే సామర్థ్యాన్ని ఈ స్కిల్​ టెస్టులో పరీక్షిస్తారు. ఇది గ్రూప్ డి అభ్యర్థులకు. గ్రూప్ సి అభ్యర్థులు 10 నిమిషాల వ్యవధిలో నిమిషానికి 80 హిందీ/ఇంగ్లిష్​ పదాలు టైప్​ చేయాల్సి ఉంటుంది.

పరీక్ష వివరాలు..
మొత్తం 200 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. 2 గంటల సమయం. జనరల్​ అవేర్​నెస్​, రీజనింగ్​, ఇంగ్లిష్​ తదితర అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. హింది, ఇంగ్లిష్​ భాషల్లో మాత్రమే ప్రశ్నాపత్రం ఉంటుంది(పార్ట్​-III మినహాయించి). ఈ పరీక్షకు 1/3 నెగటివ్​ మార్కింగ్​ కూడా ఉంది. ఉదాహరణకు ఒక ప్రశ్నకు 2 మార్కులను కేటాయించారు. మీరు 1 తప్పు సమాధానం పెట్టారు.. అప్పుడు సరైన సమాధానాలకు మీరు సంపాదించిన మార్కుల నుంచి 0.66 మార్కులను కట్​ చేస్తారు.

పరీక్ష కేంద్రాలు..
SSC Stenographer Exam Centre List : హైదరాబాద్​, విశాఖపట్నం, బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురం, త్రిస్సూర, ముంబయి, చెన్నై, మధురై సహా వివిధ నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

అఫిషియల్​ వెబ్​సైట్​..
SSC Official Website : నోటిఫికేషన్​కు సంబంధించి సిలబస్​, కటాఫ్​ మార్కులు వంటి మరిన్ని వివరాల కోసం www.ssc.nic.in వెబ్​సైట్​ను చూడొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.