ETV Bharat / bharat

IBPS PO Jobs : డిగ్రీ అర్హతతో 3049 బ్యాంకు పీఓ ఉద్యోగాలు.. అప్లై​ చేసుకోండిలా!

author img

By

Published : Aug 1, 2023, 2:33 PM IST

IBPS PO Jobs 2023 : ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలని కలలు కనే వారికి గుడ్​ న్యూస్​ వినిపించింది ఐబీపీఎస్​. ​మొత్తం 3049 పీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది. మరి ఏయే బ్యాంకుల్లో పోస్టింగ్​ కల్పిస్తారు, జీతభత్యాలు ఎలా ఉంటాయి, వయో పరిమితి, దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడ మొదలైన పూర్తి వివరాలు మీ కోసం.

IBPS PO Recruitment 2023 How Many Posts Application Last Date Salary Syllabus Exam Centers Full Details Here IBPS PO Vacancy 2023
ఐబీపీఎస్​ పీఓ నోటిఫికేషన్​

IBPS PO Notification 2023 : ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగం చేయాలని ఎదురుచూస్తున్న ఆశావహులకు ఐబీపీఎస్ (ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్​ పర్సనల్​ సెలక్షన్​) శుభవార్త చెప్పింది. పీఓ/మేనేజ్​మెంట్​ ట్రైనీ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. 11 పబ్లిక్​ సెక్టార్​ బ్యాంకుల్లోని మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు ప్రకటించింది.

ఇన్ని ఖాళీలు..
IBPS PO Vacancy 2023 : 3049 ప్రొబేషనరీ ఆఫీసర్​/ మేనేజ్​మెంట్​ ట్రైనీ పోస్టులు.

విద్యార్హత..
IBPS PO Education Eligibility : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత.

ఏజ్​ లిమిట్..
IBPS PO Age Limit 2023 : 20-35 సంవత్సరాలు ఉండాలి. పీఓ హోదాలోని సీనియర్ మేనేజర్​, మేనేజర్​, అసిస్టెంట్ మేనేజర్​ పోస్టులకు ఐబీపీఎస్​ నిబంధనల ప్రకారం కనిష్ఠ, గరిష్ఠ ఏజ్​ లిమిట్​ను నిర్దేశించారు. పూర్తి వివరాల కోసం ఐబీపీఎస్​ వెబ్​సైట్​ను సందర్శించవచ్చు.

జీతభత్యాలు..
IBPS PO Jobs Salary : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.52,000-రూ.55,000 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు తేదీలు..

  • ప్రారంభ తేదీ - 2023 ఆగస్టు 1
  • చివరితేదీ - 2023 ఆగస్టు 21

ఎంపిక విధానం..
IBPS PO Selection Process 2023 : ప్రిలిమ్స్​, మెయిన్స్, ఇంటర్వ్యూ. రాతపరీక్షల్లో వచ్చిన మార్కులను అనుసరించి ఓవరాల్​ కటాఫ్​ను నిర్ణయిస్తారు. దీంట్లో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.

ఈ అర్హతలు ఉంటే ప్రాధాన్యం..

  • స్థానిక భాషపై పట్టు
  • కంప్యూటర్​ పరిజ్ఞానం
  • అగ్రికల్చర్​, హార్టికల్చర్​, ఫారెస్ట్రీ, యానిమల్​ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చురల్​​ ఇంజినీరింగ్​, పిసికల్చర్​, అగ్రికల్చరల్​ మార్కెటింగ్ అండ్​ కోఆపరేషన్, ఐటీ, మేనేజ్​మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీ విభాగాల్లో చదివిన వారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది.

ఈ బ్యాంకుల్లో పోస్టింగ్..
IBPS PO Job Posting : యూనియన్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, యూకో బ్యాంక్​, పంజాబ్​ అండ్​ సింధ్​ బ్యాంక్​, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్, ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్, ఇండియన్​ బ్యాంక్, సెంట్రల్​ బ్యాంక్​ ఆప్​ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, బ్యాంక్​ ఆఫ్​​ బరోడా, బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర.

అప్లికేషన్​ ఫీజు..

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు - రూ.175/-
  • జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ​- రూ.850/-

వయోపరిమితి సడలింపులు..

  • ఎస్సీ - 5 ఏళ్లు
  • ఎస్టీ - 5 ఏళ్లు
  • దివ్యాంగులు - 10 ఏళ్లు
  • ఓబీసీ - 3 ఏళ్లు
  • ఎక్స్​ సర్వీస్​మెన్​ - 5 ఏళ్లు

ప్రిలిమ్స్​ పరీక్షా తేదీలు..
IBPS PO Prelims Exam Dates : 2023 సెప్టెంబర్​ 23, 30, అక్టోబర్​ 1 తేదీల్లో ప్రిలిమ్స్​ పరీక్షను ఆన్​లైన్​లో నిర్వహించనున్నారు.

మెయిన్స్​ ఎగ్జామ్​ డేట్​..
IBPS PO Mains Exam Dates : 2023 నవంబర్​ 5.

నోట్: అ​క్టోబర్​ నుంచి మెయిన్స్​ పరీక్షకు సంబంధించి అడ్మిట్​ కార్డులను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

పరీక్షా కేంద్రాలు..
IBPS PO Exam Centers List : దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, మైసూరు, పుదుచ్చేరి , విజయవాడ, వారణాసి, లఖ్​నవూ, దిల్లీ, అలహాబాద్​, ఆగ్రా తదితర ప్రాంతాల్లో పరీక్షలను నిర్వహించనున్నారు.

అప్లికేషన్​ మోడ్​..
IBPS Application Process : ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

నోట్​ : ఐబీపీఎస్​ సిలబస్​, పరీక్ష ఎన్ని మార్కులకు ఉంటుంది, నెగటివ్​ మార్కింగ్​ ఏమైనా ఉందా? మొదలైన పూర్తి వివరాల కోసం ఐబీపీఎస్​ అధికారిక వెబ్​సైట్​ www.ibps.in​ను చూడండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.