ETV Bharat / bharat

SSC jobs 2023 : ఎస్​ఎస్​సీ భారీ నోటిఫికేషన్​.. పదో తరగతి అర్హతతో 1158 పోస్టుల భర్తీ!

author img

By

Published : Jul 1, 2023, 10:06 AM IST

SSC Recruitment 2023 for 1558 MTS and havaldar posts
SSC jobs 2023

SSC MTS Jobs 2023 : నిరుద్యోగ యువతకు గుడ్​ న్యూస్​. స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ (ఎస్​ఎస్​సీ) భారీ నోటిఫికేషన్​​ విడుదల చేసింది. 1198 మల్టీ టాస్కింగ్​ స్టాఫ్, 360 హవల్దార్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన వెలువరించింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర పూర్తి వివరాలు మీ కోసం.

SSC MTS Jobs 2023 : స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్ (ఎస్​ఎస్​సీ)​ మల్టీ టాస్కింగ్ స్టాఫ్​, హవల్దార్​ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. కనీస విద్యార్హత 10వ తరగతి మాత్రమే. ఆసక్తి గల అభ్యర్థులు జులై 21లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు

  • మల్టీ టాస్కింగ్​ స్టాఫ్​ (నాన్​ టెక్నికల్​) - 1198 పోస్టులు
  • హవల్దార్​ - 360 పోస్టులు

నోట్​ : ఈ పోస్టులు గ్రూప్​ - సి, నాన్ గెజిటెడ్​, నాన్​ మినిస్టీరియల్ కేటగిరీకి చెందినవి.

విద్యార్హతలు ఏమిటి?
SSC MTS 2023 Eligibility : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా విద్యాసంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి ఎంత?
SSC MTS 2023 AGE Limit : 2023 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయస్సు ఆయా పోస్టులను అనుసరించి 18 నుంచి 25 సంవత్సరాలు లేదా 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము వివరాలు :

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
  • జనరల్​, ఓబీసీ కేటగిరీల వారు మాత్రం దరఖాస్తు రుసుము కింద రూ.100 ఆన్​లైన్​లో చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

  • మల్టీ టాస్కింగ్​ స్టాఫ్​ పోస్టులకు సెషన్​ 1, 2 కంప్యూటర్​ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణత సాధించిన వారిని.. డాక్యుమెంట్​ వెరిఫికేషన్​ చేసి ఎంపిక చేస్తారు.
  • హవల్దార్​ పోస్టులకు కంప్యూటర్​ బేస్డ్​ ఎగ్జామ్​ నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్​, ఫిజికల్ స్టాండర్డ్​ టెస్ట్​ చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయినవారిని డాక్యుమెంట్​ వెరిఫికేషన్​ చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

ఆంధ్రప్రదేశ్​లోని పరీక్ష కేంద్రాలు : చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం

తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్​, కరీంనగర్​, వరంగల్​

ముఖ్యమైన తేదీల వివరాలు

  • ఆన్​లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2023 జూన్​ 30
  • ఆన్​లైన్ దరఖాస్తులకు ఆఖరు తేదీ : 2023 జులై 21
  • ఆన్​లైన్​ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 2023 జులై 22
  • ఆఫ్​లైన్ చలానా జనరేషన్​కు చివరి తేదీ : 2023 జులై 24
  • దరఖాస్తు సవరణకు అవకాశం : 2023 జులై 26 నుంచి 2023 జులై 28 వరకు
  • కంప్యూటర్​ బేస్డ్​ పరీక్ష తేదీ : 2023 సెప్టెంబర్​

ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఎస్​ఎస్​సీ అధికారిక వెబ్​సైట్​ను సందర్శించండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.