ETV Bharat / bharat

ఫేస్​బుక్​పై సోనియా, రాహుల్ ఫైర్.. డెమొక్రసీకి డేంజర్ అంటూ..

author img

By

Published : Mar 16, 2022, 3:03 PM IST

Sonia Gandhi raises social media issue
Sonia Gandhi raises social media issue

Sonia Gandhi raises social media issue: ఫేస్​బుక్ వంటి సామాజిక మాధ్యమాలు దేశ ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకుంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల ప్రచారాల విషయంలో ఫేస్​బుక్ పక్షపాతం వహిస్తోందని లోక్​సభలో పేర్కొన్నారు.

Sonia Gandhi raises social media issue: ఫేస్​బుక్ సహా ఇతర సోషల్ మీడియా సంస్థలు భారత ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకుంటున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధ్వజమెత్తారు. ఈ వ్యవస్థీకృత జోక్యానికి అంతం పలకాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లోక్​సభలో జీరోఅవర్ సందర్భంగా మాట్లాడిన సోనియా.. ఎన్నికల అడ్వర్టైజ్​మెంట్​ల కోసం భాజపాకు ఫేస్​బుక్ తక్కువ ధరకే డీల్స్ కుదిర్చిందని సోనియా ఆరోపించారు. పలు అంతర్జాతీయ పత్రికా కథనాలను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

లోక్​సభలో సోనియా గాంధీ

"ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఫేస్​బుక్ వంటి సామాజిక మాధ్యమ సంస్థల వ్యవస్థీకృత జోక్యానికి ప్రభుత్వం చరమగీతం పాడాలి. అధికారంలో ఎవరు ఉన్నా ప్రజాస్వామ్యాన్ని, సామాజిక సామరస్యాన్ని కాపాడాలి."

-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కేంద్రంపై మండిపడ్డారు. ఫేస్​బుక్ మాతృసంస్థ మెటావర్స్ పేరును ఎద్దేవా చేస్తూ.. దేశ ప్రజాస్వామ్యానికి ఫేస్​బుక్ ప్రమాదకరం(వర్స్ ఫర్ డెమొక్రసీ) అంటూ అభివర్ణించారు. అడ్వర్టైజ్​మెంట్​ల విషయంలో ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే భాజపాకు ఫేస్​బుక్ తక్కువ మొత్తాన్ని వసూలు చేసిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి అల్ జజీరా కథనాలను పార్లమెంట్​లో ప్రస్తావించారు.

ఇదీ చదవండి: సుప్రీం కోర్టు ముంగిట 'హిజాబ్ వివాదం'.. హోలీ తర్వాతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.