ETV Bharat / bharat

సోనియా, రాహుల్​ వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విపక్ష మీటింగ్​ వెళ్లి వస్తుండగా..

author img

By

Published : Jul 18, 2023, 9:27 PM IST

Updated : Jul 18, 2023, 10:32 PM IST

Sonia And Rahul Gandhi Flight Emergency Landing : సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్ ఎయిర్​పోర్ట్​లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వీరిద్దరూ బెంగళూరులో జరిగిన విపక్ష కూటమి సమావేశానికి హాజరై.. తిరిగి దిల్లీకి వెళ్తుండగా ఘటన జరిగింది.

Sonia Gandhi Rahul Gandhi Flight Makes Emergency Landing In Bhopal madyapradesh
Sonia Gandhi Rahul Gandhi Flight Makes Emergency Landing In Bhopal madyapradesh

Sonia And Rahul Gandhi Flight Emergency Landing : కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్ ఎయిర్​పోర్ట్​లో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం అత్యవసరంగా ల్యాండ్​ అయిందని పోలీసులు తెలిపారు. అయితే, విమానాశ్రయ అధికారులు మాత్రం.. సాంకేతిక లోపం కారణంగానే ఫ్లైట్ ల్యాండ్​ చేసినట్లు వెల్లడించారు. కచ్చితమైన సమాచారం మాత్రం ఇంకా తెలియరాలేదు. కాగా సోనియా, రాహుల్​.. బెంగళూరులో జరిగిన విపక్ష కూటమి సమావేశానికి హాజరై.. తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే సోనియా, రాహుల్ ఎక్కడికి వెళుతున్నారనేది స్పష్టత లేదు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​ సమాచారం అందుకున్న కాంగ్రెస్​ నేతల కొందరు హుటాహుటిన భోపాల్​కు వెళ్లారు.

Opposition Meeting In Bengaluru : సార్వత్రిక సమరానికి సమయాత్తమవుతున్న విపక్ష నేతలు.. బెంగళూరు వేదికగా రెండు రోజులపాటు విస్త్రృత చర్చలు జరిపారు. ఈ భేటీకి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సహా దిల్లీ, పంజాబ్, బిహార్, ఝార్ఖండ్, బంగాల్, తమిళనాడు సీఎంలు పాల్గొన్నారు. ఎన్​సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఎస్​పీ అధినేత అఖిలేశ్ యాదవ్​, ఆర్​జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. సోమవారం సమావేశంలో ఉమ్మడి ప్రణాళిక రూపకల్పన, సంయుక్త ఆందోళనల నిర్వహణ లక్ష్యంగా సమాలోచనలు జరిపిన నేతలు.. మంగళవారం కూటమి పేరు ఖరారు చేశారు. ఇండియన్ నేషనల్ డెవెలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్‌గా.. కూటమికి నామకరణం చేశారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. తక్షణమే కులాల ఆధారంగా జనగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేశారు. అనంతరం సమావేశం ముగించుకొని సోనియా, రాహుల్ దిల్లీకి వెళుతుండగా.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది.

Last Updated : Jul 18, 2023, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.