ETV Bharat / bharat

రాష్ట్రపతి ముందుకు షబ్నమ్​ క్షమాభిక్ష పిటిషన్​

author img

By

Published : Feb 19, 2021, 5:14 PM IST

Updated : Feb 19, 2021, 7:25 PM IST

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షబ్నమ్‌.. స్వాతంత్య్రానంతరం తొలిసారి ఉరిశిక్షకు గురయ్యే మహిళ అయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఆమె కుమారుడు మహ్మద్​ తాజ్​ క్షమాభిక్ష కోరుతూ.. రాష్ట్రపతి రామ్​నాథ్​​ కోవింద్​ను ఆశ్రయించాడు. గవర్నర్​నూ మరోసారి క్షమాభిక్ష కోరారు.

son-of-shabnam-pray-to-president-for-mercy-of-his-mother-in-amroha
క్షమాభిక్ష పిటిషన్​ దాఖలు చేసిన షబ్నమ్​ కుమారుడు

ప్రియుడితో కలిసి అమ్రోహాలోని తన కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చిన యూపీ మహిళ షబ్నమ్​ను ఉరితీసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో షబ్నమ్​ కుమారుడు తన తల్లి చేసిన నేరాలను క్షమించాలని కోరుతూ.. రాష్ట్రపతి రామ్​నాథ్​​ కోవింద్ ఎదుట క్షమాభిక్ష పిటిషన్​ దాఖలు చేశాడు. రామ్​పుర్​ జైలులో తన తల్లిని కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్న మహ్మద్​ తాజ్​.. భావోద్వేగానికి లోనయ్యాడు.

షబ్నమ్​ కేసుకు సంబంధించి ఇప్పటికే గవర్నర్​ అనందిబెన్​ పటేల్​ క్షమాభిక్షను తిరస్కరించారు. అయితే శుక్రవారం మరోసారి గవర్నర్​ ముందుకు వచ్చింది. ఈ సారి కూడా క్షమాభిక్ష తిరస్కరణకు గురైతే.. ఆమెను ఉరి తీయడానికి మథుర జైలు అధికారులు సిద్ధంగా ఉన్నారు. నిర్భయ కేసులో నిందితులను ఉరి వేసిన పవన్‌ జల్లాదే షబ్నమ్‌నూ ఉరి తీసే అవకాశం ఉంది. ఉరి తీసే గదిని జల్లాద్‌ ఇప్పటికే రెండు సార్లు పరిశీలించారు.

ఎవరీ మహ్మద్​ తాజ్​..?

షబ్నమ్​ 2008లో ప్రియుడితో కలిసి కుటుంబ సభ్యులను ఏడుగురిని అత్యంత పాశవికంగా గొడ్డిలితో నరికి చంపింది. దీంతో ఇరువురిపై కేసులు నమోదయ్యాయి. అప్పటికే మహ్మద్​ తాజ్ కడుపులో ఉన్నాడు​. తరువాత.. షబ్నం జైలులోనే తాజ్​కు జన్మనిచ్చింది. జైలు నిబంధనల ప్రకారం పిల్లవాడికి ఆరేళ్ల వయసు వచ్చిన తరువాత కారాగారం పరిసరాల్లో ఉండకూడదు. దీంతో షబ్నమ్​.. తన మిత్రుడైన ఉస్మాన్​ సైఫీని తాజ్​కు సంరక్షకునిగా బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి తాజ్​కు సంబంధించిన అన్నీ వ్యవహారాలను సైఫీ చూసుకునే వారు. బులంధ్​శహర్​లోని సుశీలా విహార్​ కాలనీలో నివసిస్తున్నారు. ప్రస్తుతం తాజ్​ తన తల్లి చేసిన తప్పని క్షమించి.. మరణ శిక్ష నుంచి రక్షించాలని రాష్ట్రపతిని కోరారు.

ఇదీ చూడండి: స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష!

Last Updated : Feb 19, 2021, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.