ETV Bharat / bharat

ట్రిమ్మర్​లో దాచి రూ.24 లక్షల విలువైన బంగారం స్మగ్లింగ్​

author img

By

Published : Dec 25, 2021, 6:24 PM IST

Smuggled Gold Seized: జైపుర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 24 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారాన్ని గుర్తించారు.

Gold Biscuit Seized
కస్టమ్స్​ అధికారులు పట్టుకున్న బంగారం బిస్కట్లు

ట్రిమ్మర్​లో దాచి రూ.24 లక్షల విలువైన బంగారం స్మగ్లింగ్​

Smuggled Gold Seized: జైపుర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి జైపుర్ వచ్చిన ఒక ప్రయాణికుడికి చెందిన లగేజిని అనుమానంతో కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. షేవింగ్​ చేసుకునే ట్రిమ్మర్​లో దాచుకుని 491 గ్రాముల బంగారం తెచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ రూ.24 లక్షలు ఉంటుందని చెప్పారు.

Gold Biscuit Seized
ట్రిమ్మర్​లో దాచిన బంగారం

నిందితుడి లగేజీని ఎక్స్​రే యంత్రంతో స్కాన్​ చేసినప్పుడు నల్లని ఛాయలు కనిపించాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు అనుమానంతో ట్రిమ్మర్​ను బద్దలు కొట్టగా.. కార్బన్ ప్లాస్టిక్​తో చుట్టి ఉన్న బంగారం బిస్కట్​లను ట్రిమ్మర్​లో దాచినట్లు తెలుసుకున్నారు. నిందితున్ని అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Gold Biscuit Seized
కస్టమ్స్​ అధికారులు పట్టుకున్న బంగారం బిస్కట్లు

ఇదీ చదవండి: ఆ రికార్డులు నాశనం చేసేందుకే.. కోర్టులో బాంబు దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.