ETV Bharat / bharat

కేంద్రంతో చర్చలకు రైతులు సిద్ధం- కేసులు ఎత్తివేసే వరకు నిరసన

author img

By

Published : Dec 4, 2021, 5:03 PM IST

Updated : Dec 4, 2021, 5:55 PM IST

Farmers protest latest news today: ప్రభుత్వంతో పెండింగ్​ డిమాండ్లపై చర్చించేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది సంయుక్త కిసాన్​ మోర్చ. కేసులు ఎత్తివేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Farmers protest
ఆందోళన చేస్తున్న రైతులు

Farmers protest latest news today: సాగు చట్టాలను రద్దు చేసిన క్రమంలో కనీస మద్దతు ధర, ఆందోళనల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు పరిహారం, కేసుల ఎత్తివేత వంటి పెండింగ్​లో ఉన్న డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధమయ్యారు రైతులు. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది సంయుక్త కిసాన్​ మోర్చా.

భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు శనివారం దిల్లీలో సమావేశమైన సంయుక్త కిసాన్​ మోర్చా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రాకేశ్​ టికాయిత్​ తెలిపారు. కమిటీలో రైతు నేతలు బల్బీర్​ సింగ్​ రజేవాల్​, అశోక్​ దావ్లే, శివ కుమార్​ కక్కా, గుర్నామ్​ సింగ్​ ఛదుని, యుధ్వీర్​ సింగ్​ ఉన్నట్లు చెప్పారు. డిసెంబర్​ 7న ఉదయం 11 గంటలకు మరోమారు మోర్చా నేతలు సమావేశమవనున్నట్లు వెల్లడించారు.

కేసులు ఎత్తివేసే వరకు నిరసన

రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసే వరకు సింఘూ సరిహద్దులను వీడబోమని, ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు ఎస్​కేఎం నేతలు. డిమాండ్ల పరిష్కారంపై రాతపూర్వకంగా తమకు హామీ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. రైతుల తరఫున వివిధ రాష్ట్రాల్లో ఎవరు చర్చలు చేపడతారనేది కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు.

ఇదీ చూడండి: కనీస మద్దతు ధరపై చట్టం తేవాల్సిందే: టికాయిత్​

Last Updated :Dec 4, 2021, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.