ETV Bharat / bharat

రూ.500 కోట్లు విలువైన హెరాయిన్​ పట్టివేత

author img

By

Published : Nov 27, 2020, 6:19 PM IST

Six persons arrested for smuggling drugs worth Rs. 500 crore in Thoothukudi
తీరప్రాంతంలో రూ.500 కోట్లు విలువైన హెరాయిన్​ పట్టివేత

డ్రగ్స్​ రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు తూత్తుకుడి కోస్టుగార్డులు. వారి నుంచి రూ.500కోట్లు విలువైన హెరాయిన్​, ఐదు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.

తమిళనాడు తూత్తుకుడి తీర ప్రాంతంలో గస్తీకాస్తున్న కోస్టు గార్డులు... మాదకద్రవ్యాలను​ రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.500 కోట్లు విలువైన హెరాయిన్​, ఐదు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.

Six persons arrested for smuggling drugs worth Rs. 500 crore in Thoothukudi
నిందితులతో అధికారులు
Six persons arrested for smuggling drugs worth Rs. 500 crore in Thoothukudi
మాదకద్రవ్యాలు, తుపాకులు

సముద్రమార్గం ద్వారా దేశంలోకి అక్రమంగా చొరబడే ఉగ్రవాదులను అడ్డుకునేందుకు నిరంతరం గస్తీ కాస్తున్నాయి తీర ప్రాంత భద్రత దళాలు. ఈ క్రమంలో కన్యాకుమారికి 10 నాటికమైళ్లు దూరంలో శ్రీలంకకు చెందిన బోటు ఆగిపోయినట్లు గుర్తించారు అధికారులు. అనుమానం వచ్చిన సిబ్బంది... బోటు వద్దకు చేరుకొని డ్రగ్స్ వ్యవహారాన్ని పసిగట్టారు. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. బోటులోని ఖాళీ డీజిల్​ ట్యాంకులో 100 కేజీల హెరాయిన్​ ప్యాకెట్లు, 20 చిన్న పెట్టెల్లో విదేశాల్లో ఉపయోగించే క్రిస్టల్​ మెత్​ బీటామైన్​ డ్రగ్స్, ఐదు తుపాకులు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Six persons arrested for smuggling drugs worth Rs. 500 crore in Thoothukudi
అధికారులకు పట్టుబడిన బోటు

నిందితులను విచారించగా.. శ్రీలంకలో బోటు అద్దెకు తీసుకొని పాకిస్థాన్​ నుంచి ఆస్ట్రేలియాకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితులను తూత్తుకుడి కోర్టులో హాజరుపరచనున్నారు.

ఇదీచూడండి: 'భారతీయులందరికీ టీకా అందేది అప్పుడే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.