ETV Bharat / bharat

అక్కడి నర్సులకు అందమే ముఖ్యం.. రూ.1500 లంచం ఇస్తేనే వైద్యం..

author img

By

Published : Oct 15, 2022, 11:05 AM IST

ఆస్పత్రికి పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి వైద్యసేవలు అందించకుండా నర్సులు.. ఫేషియల్స్​ చేసుకున్నారు. అంతే కాకుండా రూ.1500 లంచం చెల్లిస్తేనే వైద్యం చేస్తామన్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

sitapur district women hospital carelessness
అక్కడ నర్సులకు అందమే ముఖ్యం

పేషెంట్​లకు సేవలు అందించాల్సిన వైద్య సిబ్బంది తమ విధులను మరిచి మూర్ఖంగా ప్రవర్తించిన ఘటన ఉత్తర్​​ప్రదేశ్​లో వెలుగుచూసింది.
అసలు ఏం జరిగిందంటే.. సీతాపుర్​​ జిల్లాలోని మహిళా ఆస్పత్రికి శుక్రవారం రాత్రి ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతూ వచ్చింది. ఆ సమయంలో నర్సులు ఒకరికొకరు ఫేషియల్స్​​ చేసుకుంటున్నారు. గర్భిణిని గమనించిన వైద్య సిబ్బంది.. రూ.1500 లంచం ఇస్తేనే వైద్యం చేస్తామన్నారు. అందుకు ఆమె కుటుంబసభ్యులు ఇవ్వడానికి నిరాకరించగా.. అక్కడ పని చేస్తున్న స్టాఫ్​ నర్స్​ వారిని పంపించేసింది. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించారు.

అయితే ఆ ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది ఎవరి మాటలను లెక్కచేయడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. వైద్యసేవలు అందించకుండా వారి అందం పైన దృష్టి పెట్టుకుంటున్నారని.. లంచం లేకుండా పేషెంట్​ను కనీసం ముట్టుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.