ETV Bharat / bharat

వాణిజ్య నౌక హైజాక్- సముద్రపు దొంగలకు చుక్కలు చూపించిన ఇండియన్ నేవీ

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 4:43 PM IST

Ship Hijacked In Arabian Sea : అరేబియా సముద్రంలో వాణిజ్యనౌకను హైజాక్‌ చేసిన సముద్రపు దొంగలకు భారత నౌకదళం చుక్కలు చూపించింది. డిస్ట్రెస్‌ కాల్‌ అందుకున్న వెంటనే గస్తీ నిర్వహించే యుద్ధవిమానం, యుద్ధనౌకలను ఘటనాస్థలానికి తరలించింది. శనివారం తెల్లవారుజామున వాణిజ్యనౌకను అడ్డుకున్నట్లు నౌకాదళం ప్రకటించింది. అంతర్జాతీయ భాగస్వాములు, స్నేహపూర్వక దేశాలతోపాటు వాణిజ్య నౌకల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

Ship Hijacked In Arabian Sea
Ship Hijacked In Arabian Sea

Ship Hijacked In Arabian Sea : మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్‌ అయిన ఘటనను భారత నౌకదళం సమర్థంగా తిప్పికొట్టింది. సోమాలియా వెళ్తున్న MVరుయెన్‌ నౌకను కొందరు సముద్రపు దొంగలు హైజాక్‌ చేశారు. అందులో 18మంది సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు వాణిజ్య నౌక నుంచి గురువారం డిస్ట్రెస్‌ కాల్‌ రావడం వల్ల భారత నౌకాదళం అప్రమత్తమైంది. గల్ఫ్‌ ఆఫ్‌ అడెన్‌లో గస్తీ నిర్వహిస్తున్న యుద్ధ విమానం, యుద్ధనౌకలను శుక్రవారం రంగంలోకి దించినట్లు నౌకాదళం తెలిపింది. శనివారం తెల్లవారుజామున భారత యుద్ధనౌక రుయెన్‌ వాణిజ్య నౌకను అడ్డగించినట్లు పేర్కొంది. ప్రస్తుతం హైజాక్‌ అయిన రుయెన్‌ నౌక సోమాలియా తీరం దిశగా ప్రయాణిస్తున్నట్లు ప్రకటించింది. దాని పైనుంచే నౌకాదళం యుద్ధవిమానం ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది. ఆ ప్రాంతంలోని ఇతరసంస్థల సహకారంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు నౌకాదళం వెల్లడించింది.

Ship Hijacked In Arabian Sea
హైజాక్ అయిన వాణిజ్య నౌక

వాణిజ్య నౌక హైజాక్‌ అయిన ఘటనపై ఈ రీజియన్‌ నుంచి తామే మొట్టమొదట స్పందించినట్లు భారత నౌకాదళం తెలిపింది. అంతర్జాతీయ భాగస్వాములు, స్నేహపూర్వక దేశాలతోపాటు వాణిజ్య నౌకల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. 2017 తర్వాత సోమాలియా సముద్రపు దొంగలు నౌకపై జరిపిన తొలి అతిపెద్ద దాడి ఇదే అని తెలుస్తోంది.

ఇజ్రాయెల్ కార్గో నౌక హైజాక్​
Israel Ship Hijack Houthi : ఈ ఏడాది నవంబరులో తుర్కియే నుంచి భారత్‌కు వస్తున్న ఇజ్రాయెల్‌ కార్గో నౌకను యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్‌ హైజాక్‌ చేశారు. ఈ నౌకలో వివిధ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు. గెలాక్సీ లీడర్ అనే నౌకను ఎర్ర సముద్రంలో హైజాక్‌ చేసినట్లు హౌతీ రెబల్స్‌ ప్రకటించారు. హమాస్​కు వ్యతిరేకంగా గాజాపై దాడులు ఆపేంత వరకు ఇజ్రాయల్​కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.

మా దేశ పౌరులు ఎవరు లేరు ఇజ్రాయెల్‌: అయితే హైజాక్ అయిన నౌకలో భారతీయులు, ఇజ్రాయెల్‌ పౌరులు ఎవరూ లేరని ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ రక్షణ దళం ధ్రువీకరిస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ఇది అంతర్జాతీయ పర్యావసనాలకు సంబంధించిన తీవ్రమైన సమస్యగా పేర్కొంది. ఆ నౌక తుర్కియే నుంచి భారత్‌కు బయలుదేరిందని, అందులోని సిబ్బంది వివిధ దేశాలకు చెందినవారని తెలిపింది. అయితే అందులో ఇజ్రాయెల్‌ పౌరులెవరూ లేరని, అది తమ దేశానికి చెందిన నౌక కాదని IDF స్పష్టం చేసింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మంచు ఎఫెక్ట్- రెండు మెట్రో రైళ్లు ఢీ- 515మందికి గాయాలు

'ప్రిన్స్​ హ్యారీ ఫోన్ ట్యాపింగ్ నిజమే'- మిర్రర్​కు రూ.కోటికిపైగా జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.