ETV Bharat / bharat

16 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా తండ్రి, అన్న లైంగిక దాడి

author img

By

Published : Jan 19, 2022, 4:22 PM IST

Updated : Jan 19, 2022, 5:21 PM IST

SEXUALLY ASSAULTING
అత్యాచారం

sexual harassment: ఓ మైనర్​ బాలికపై సొంత తండ్రి, అన్న రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న అమానుష ఘటన ముంబయిలోని ధారావిలో వెలుగు చూసింది. ఉపాధ్యాయుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక. మరోవైపు.. దిల్లీలోని షాహ్​దారా జిల్లాలోని ఓ ఇంట్లో నలుగురు పిల్లలు, తల్లి మృతదేహాలు లభించటం కలకలం రేపింది.

Girl raped by family members: ఓ 16 ఏళ్ల బాలికపై సొంత తండ్రి, సోదరుడే లైంగిక దాడికి పాల్పడ్డారు. రెండేళ్లుగా వారి అకృత్యాలను భరిస్తూ వస్తున్న బాలిక.. చివరకు తన ఉపాధ్యాయులకు చెప్పగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ధారావిలో జరిగింది.

ఇదీ జరిగింది..

2019 నుంచి తనపై తండ్రి, సోదరుడు లైంగిక దాడికి పాల్పడుతున్నారని తన పాఠశాలోని ప్రధానోపాధ్యాయురాలికి తెలిపింది బాలిక. ఈ క్రమంలో బాలికకు ధైర్యం చెప్పిన ఉపాధ్యాయులు.. ధారావి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019, జనవరి 25న ఇంట్లో నిద్రపోతున్న తనపై అన్న అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అంతకు ముందే ఓసారి ప్లాస్టిక్​ బ్యాగ్​ ఫ్యాక్టరీలో ఉండగా తండ్రి లైంగికంగా హింసించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత పలుమార్లు దాడికి పాల్పడినట్లు తెలిపింది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధతురాలి తండ్రి (43), సోదరుడి(20)పై పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత సోమవారం ఇద్దరిని అరెస్ట్​ చేశారు. వారిని జ్యుడీషియల్​ కస్టడీకి తరలించారు.

ఇంట్లో ఐదుగురి మృతదేహాలు..

దిల్లీలోని షాహ్​దారా జిల్లాలో విషాద ఘటన జరిగింది. సీమాపురి ప్రాంతంలోని ఓ ఇంటిలో స్టవ్​​ నుంచి వెలువడిన విషవాయువు పీల్చి నలుగురు పిల్లలు సహా తల్లి మృతి చెందటం కలకలం రేపింది.

పాత సీమాపూర్​లోని ఓ భవనంలో ఉన్న ఐదో అంతస్తులో ఐదుగురు అపస్మారక స్థితిలో పడి ఉన్నారని బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఫోన్​ వచ్చిందని పోలీసులు తెలిపారు. సంఘటాస్థలానికి చేరుకుని పరిశీలించగా.. మహిళ సహా ముగ్గురు చిన్నారులు మృతి చెందారని, ఓ పాపను ఆసుపత్రికి తరలించినప్పటికీ కాపాడలేకపోయామన్నారు. ప్రాథమిక విచారణలో ఎలాంటి వెలుతురు లేని గదిలో ఉన్న స్టవ్​ నుంచి వచ్చిన విషవాయువుల ద్వారానే ఊపిరాడక చనిపోయారని తేలిందని చెప్పారు. అయితే.. పోస్ట్​మార్టం ద్వారానే అసలు కారణం తెలుస్తుందన్నారు.

ఇదీ చూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థికి అర గంటలో 2 టీకాలు!

Last Updated :Jan 19, 2022, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.