పోలీసులపై గ్రామస్థుల దాడి.. ఏడుగురికి తీవ్రగాయాలు.. అదే కారణం!

author img

By

Published : Sep 17, 2022, 10:15 PM IST

Updated : Sep 17, 2022, 10:36 PM IST

Seven Bihar cops critically injured as mob attacks

కల్తీ మద్యం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో జైలులోని మరణించాడు. దీంతో ఆగ్రహం పెంచుకున్న అతడి గ్రామస్థులు.. కర్రలు, ఇనుపరాడ్లతో పోలీస్​స్టేషన్​పై దాడికి దిగారు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు.

బిహార్​లోని కాటిహార్​ జిల్లాలో​ పోలీసులపై గ్రామస్థులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కల్తీ మద్యం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి కస్టడీలో చనిపోవడం వల్ల అతడి గ్రామస్థులు దాడికి దిగారు.

పోలీసుల వివరాలు ప్రకారం.. శుక్రవారం రాత్రి అమ్డోల్ గ్రామానికి చెందిన ప్రమోద్​ కుమార్​ సింగ్​(40)ను కల్తీ మద్యం కేసులో ప్రాణ్​పుర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే శనివారం ఉదయం.. అతడు అనుమానాస్పద రీతిలో జైలులోనే చనిపోయాడు. దీంతో గ్రామస్థులు పోలీస్​స్టేషన్​ ఎదుట ఆందోళనకు దిగారు. స్టేషన్​ ఆవరణలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. అదే సమయంలో స్టేషన్​లోకి చొరబడి పోలీసులపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో గాయపడిన ఏడుగురు పోలీసులను కాటిహార్​ జిల్లా ఆస్పత్రికి అధికారులు తరలించారు.
ప్రమోద్​ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, పోలీసులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి: నదిలో బోల్తా పడ్డ బస్సు.. లోపల 50 మంది ప్రయాణికులు.. ఆరుగురు మృతి

CCTV Video: ఘోర రోడ్డు ప్రమాదం.. గర్భస్థ శిశువు సహా ముగ్గురు దుర్మరణం

Last Updated :Sep 17, 2022, 10:36 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.