ETV Bharat / bharat

'ప్రజల ప్రాణాలను పణంగా పెడతారా?'

author img

By

Published : Jul 20, 2021, 1:22 PM IST

supreme court to kerala govt, కేరళ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు
'కేరళ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోంది'

కరోనా ఆంక్షలను సడలిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజల ప్రాణాలను ప్రభుత్వం పణంగా పెడుతోందని వ్యాఖ్యానించింది. ఈ కారణంగా కొవిడ్​ కేసులు పెరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

బక్రీద్​ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో ఆంక్షలను సడలిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ ఈ సడలింపులు చేయడం అనవసరమని వ్యాఖ్యానించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం.. మహమ్మారికి ప్రజల ప్రాణాలు పణంగా పెడుతోందని పేర్కొంది. కేరళ ప్రభుత్వ సడలింపులపై దాఖలైన పిటిషన్​పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

'అదే జరిగితే చర్యలు తప్పవు'

వ్యాపారుల ఒత్తిడికి లొంగి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని జస్టిస్​ ఆర్​ఎఫ్​ నారీమన్​, జస్టిస్​ బీఆర్​ గవాయ్​తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. జీవించే హక్కు గురించి పేర్కొంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్​ 21ను ప్రభుత్వం గమనించాలని సూచించింది. ఈ ఆంక్షల సడలింపు వైరస్​ వ్యాప్తిపై ప్రభావం చూపిస్తే.. దానిపై ఎవరైనా కేసు దాఖలు చేయవచ్చని స్పష్టం చేసింది. పిటిషన్​ను పరిశీలించి ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని హెచ్చరించింది.

ఇదీ చదవండి : భారత్‌లో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.