ETV Bharat / bharat

ఔను.. ప్రీతిని ర్యాగింగ్ చేశా.. పోలీసుల విచారణలో సైఫ్

author img

By

Published : Mar 9, 2023, 8:16 AM IST

Doctor preethi suicide case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌ను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు సైఫ్ ప్రీతిని ర్యాగింగ్ చేసినట్లు ఒప్పుకున్నట్టు తెలిసింది.

Doctor preethi suicide case
Doctor preethi suicide case

Doctor preethi suicide case :వరంగల్ కేఎంసీ కళాశాలకు చెందిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు.. దాని వెనక ఉన్న వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇప్పటివరకు తాను ప్రీతిని వేధించలేదని చెబుతూ వస్తోన్న సైఫ్.. తాజాగా పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

Saif confession in preethi suicide case : రోజుకో మలుపు తిరుగుతున్న డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు సైఫ్ విచారణలో కీలక విషయాలు చెప్పాడు. ప్రీతిని తాను ర్యాగింగ్ చేసినట్లు ఎట్టకేలకు పోలీసుల ఎదుట సైఫ్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 22న ప్రీతి ఆత్మహత్యకు పాల్పడటం.. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించడం.. ఫిబ్రవరి 26న ఆమె మరణించడం తెలిసిందే. ఈ కేసులో మొదట నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

preethi suicide case latest update : ప్రీతి ఆత్మహత్యకు సైఫ్ వేధింపులే కారణమని పోలీసులు చెప్పినా.. సైఫ్ మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారేస్తూ వచ్చాడు. తను సీనియర్ కనుక ప్రీతి వృత్తిరీత్యా తప్పు చేస్తే అది తప్పు అని చెప్పానే కానీ.. ర్యాగింగ్ చేయలేదని వాదిస్తూ వచ్చాడు. కానీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి.. వాట్సాప్ చాట్స్ బయటపెట్టడంతో సైఫ్ దిగొచ్చాడు. ఆధారాలన్నీ తనకు వ్యతిరేకంగా ఉండటంతో ఎట్టకేలకు.. తాను ప్రీతిని ర్యాగింగ్ చేసినట్లు ఒప్పుకున్నాడు.

సైఫ్ తన తప్పును ఒప్పుకోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. దాదాపు నాలుగు రోజుల పాటు విచారణ జరిపి..పక్కా ఆధారాలతో సైఫ్‌ను సెంటర్ చేశారు. పోలీసులు చూపిన ఆధారాలతో ఇక సైఫ్ తాను తప్పించుకోలేనని అర్థం చేసుకుని నిజం అంగీకరించినట్లు సమాచారం. సైఫ్ కస్టడీ ముగిసిన తర్వాత మార్చి 6న కోర్టులో అతడిని ప్రవేశపెట్టనున్నారు. ఆ సమయంలోనే పోలీసులు కోర్టుకు సమర్పించాల్సిన కన్ఫెషన్ నివేదికలో ఈ విషయాలు పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మరోవైపు ప్రీతి మరణంపై ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రీతిని సైఫ్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆమె తండ్రి నరేంద్ర ఆరోపించారు. ప్రీతి ఆత్మహత్య ఘటనలో ఎవరి ప్రమేయంలో ఉందో పోలీసులు తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో పారదర్శకంగా విచారణ జరిపి తన కూతురికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.