ETV Bharat / bharat

కేంద్రం కొత్త రూల్స్​- బైక్​పై పిల్లలతో వెళ్తే ఇవి తప్పనిసరి!

author img

By

Published : Feb 16, 2022, 4:39 PM IST

Updated : Feb 16, 2022, 5:33 PM IST

safety of children below four years of age
safety of children below four years of age

Safety of Children: బైక్​పై చిన్నారులను తీసుకెళ్లేవారికి కేంద్రం కొత్త రూల్స్​ విధించింది. ఆ వాహనం వేగం గంటకు 40 కి.మీ. దాటకూటదని స్పష్టం చేసిన రోడ్డు,రవాణా మంత్రిత్వ శాఖ.. ప్రయాణికులకు మరికొన్ని సూచనలు చేసింది.

Safety of Children: పిల్లల్ని బైక్​పై తీసుకెళ్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నియమ నిబంధనలను రూపొందించింది.

కొత్త నిబంధనల ప్రకారం 4 ఏళ్లలోపు చిన్నారులను తీసుకెళ్లేటప్పుడు లైఫ్‌జాకెట్‌ లాంటి కొత్త తరహా జాకెట్‌(సేఫ్టీ హార్నెస్​) ధరించాలని పేర్కొంది. ఈ జాకెట్‌కు ఉన్న స్ట్రాప్స్‌ని డ్రైవర్‌ నడుము చుట్టూ బెల్టు మాదిరిగా బిగించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. క్రాష్​ హెల్మెట్​ కూడా తప్పనిసరి అని వెల్లడించింది.

ఆ మోటార్​ సైకిల్​ వేగం రూ. 40 కిలోమీటర్లకు మించొద్దని కూడా కేంద్రం వెలువరించిన నోటిఫికేషన్​లో స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం 2022లో (రెండో సవరణ) సంబంధిత నియమాలను పొందుపరిచింది. నిబంధనలు ఖరారైన ఏడాది తర్వాత.. ఇవి అమల్లోకి వస్తాయని ​నోటిఫికేషన్​లో పేర్కొంది.

వెహికిల్​ ట్రాకింగ్​ సిస్టమ్​ డివైస్​..

ఆర్గాన్​, నైట్రోజన్​, ఆక్సిజన్​ సహా ఇతర ప్రమాదకరమైన స్వభావం కలిగిన వస్తువులను తీసుకెళ్లే వాహనాలకూ కేంద్రం కొత్త రూల్స్​ ప్రతిపాదించింది. వాటి ముసాయిదాను(డ్రాఫ్ట్​ నోటిఫికేషన్​) మంగళవారం విడుదల చేసింది. ఆ వాహనాలు తప్పనిసరిగా వెహికిల్​ ట్రాకింగ్​ సిస్టమ్​ డివైస్​ను కలిగి ఉండాలని స్పష్టం చేసింది.

వీటిపై సలహాలు, సూచనలను ఆహ్వానించింది. ఇందుకోసం 30 రోజుల గడువు విధించింది.

ఇవీ చూడండి: డోభాల్ ఇంట్లోకి చొరబాటుకు యత్నం... నిందితుడు అరెస్ట్

'రోజూ మందు తాగే అలవాటు ఉందా? సంతానోత్పత్తి కష్టమే!'

Last Updated :Feb 16, 2022, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.