ETV Bharat / bharat

భక్తుల శరణుఘోష మధ్య మకరజ్యోతి దర్శనం

author img

By

Published : Jan 14, 2021, 6:59 PM IST

Updated : Jan 14, 2021, 7:50 PM IST

సంక్రాంతి పర్వదినాన శబరిమల అయ్యప్పస్వామి ఆలయం శరణుఘోషతో మార్మోగింది. మకరజ్యోతి రూపంలో స్వామి.. భక్తులకు దర్శనమిచ్చారు. కొవిడ్ కారణంగా ఈసారి పరిమిత సంఖ్యలోనే భక్తులు హాజరయ్యారు.

Sabarimala : Devotees await Makaravilakku
భక్తుల శరణుఘోష మధ్య మకరజ్యోతి దర్శనం

కేరళలోని శబరిమలలో సంక్రాంతి సందర్భంగా పొన్నాంబల మేడు కొండల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది. కొవిడ్​ నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో వచ్చిన భక్తులు మకరజ్యోతి దర్శనంతో తన్మయత్వం పొందారు. పంబ, పులిమేడ్‌, నీలికల్ ‌ప్రాంతాల్లో జ్యోతి వీక్షణకు ట్రావెన్​కోర్​ దేవస్థానం ఏర్పాట్లు చేసింది.

makar jyothi, kerala
మకరజ్యోతి దర్శనం

5000 మందే..

కరోనాను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మకరజ్యోతి దర్శనానికి ఐదు వేల మందిని మాత్రమే అనుమతించారు. ఇందుకోసం ఆన్​లైన్​లో పేరు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు జరిపారు. పంచలిమేడు, పరున్తుపుర, పుల్మేడు ప్రాంతాల్లో భక్తులు బస చేయడాన్ని నిషేధించారు. ​

ఇదీ చదవండి : జల్లికట్టుకు రాహుల్​ హాజరు వెనుక ఇదీ కారణం!

Last Updated : Jan 14, 2021, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.