ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం

author img

By

Published : Feb 8, 2021, 3:36 PM IST

Updated : Feb 8, 2021, 4:56 PM IST

జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ(సవరణ)-బిల్లు 2021.. రాజ్యసభలో సోమవారం ఆమోదం పొందింది. దీంతో జమ్ముకశ్మీర్ కేడర్​కి చెందిన సివిల్​ సర్వీసు అధికారులు అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం యూనియన్ టెరిటరీ (ఆగ్ముత్​) పరిధిలోకి రానున్నారు.

RS passes Jammu and Kashmir Reorganisation (Amendment) Bill
జమ్ముకశ్మీర్​ పునర్విభజన చట్టానికి రాజ్యసభ ఆమోదం

జమ్ముకశ్మీర్​ పునర్విభజన బిల్లు 2021కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్ముకశ్మీర్ కేడర్​కి చెందిన సివిల్​ సర్వీసు అధికారును అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం యూనియన్ టెరిటరీ (ఆగ్ముత్​)లో విలీనం చేసే ఆర్డినెన్స్‌ ఇక చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లును గతవారం లోక్​సభలో ప్రవేశపెట్టారు.

''ఈ బిల్లు ఆమోదంతో జమ్ముకశ్మీర్​ భూభాగం మొత్తానికి భారత రాజ్యాంగం పూర్తిగా వర్తించనుంది. కేంద్రపాలిత ప్రాంతాన్ని సమర్థవంతంగా నడిపించే అనుభవం ఉన్న అధికారుల లభ్యత మరింత పెరగనుంది.''

-జీ. కిషన్​ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

జమ్ముకశ్మీర్​లో సుమారు 170 కేంద్ర చట్టాలను అమలు చేస్తున్నామని జీ. కిషన్​ రెడ్డి వివరించారు. జమ్ము, కశ్మీర్​, లేహ్​ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారుల పరిధిని, లభ్యతను ఈ బిల్లు మరింత పెంచుతుందని తెలిపారు. ఇకపై వీరిని కేంద్రం నేరుగా నియమించనున్నట్లు పేర్కొన్నారు.

భగ్గుమన్న ప్రతిపక్ష నేత..

జమ్మకశ్మీర్‌ శాశ్వత కేంద్రపాలిత ప్రాంత హోదాపై రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్​ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్రహోదా లేనట్లేనా..?

'ప్రస్తుతం పనిచేస్తోన్న జమ్ముకశ్మీర్​ కేడర్ బాగా పనిచేయట్లేదా?' అని హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు ఆజాద్​. బాగానే పనిచేస్తోందంటే 'ఆగ్ముత్'లో విలీనం చేయాల్సిన అవసరమేంటని నిలదీశారు? ప్రస్తుత బిల్లు ద్వారా జమ్ముకశ్మీర్​ను శాశ్వతంగా యూనియన్ ఆఫ్​ ఇండియాలో విలీనం చేయాలని కేంద్రం భావిస్తే.. అంతకంటే అవమానం ఇంకొకటి ఉండదన్నారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

కేంద్రం చర్యలతో జమ్ముకశ్మీర్​లో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందన్నారు గులాం నబీ ఆజాద్. నిరుద్యోగం పెరిగిపోయిందని, పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనాకు ముందు విధించిన కర్ఫ్యూతో పాటు.. లాక్​డౌన్​తో స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయని.. ఫలితంగా ఉపాధ్యాయుల జీవితాలు సందిగ్ధంలో పడ్డాయన్నారు. ఇక పర్యటక రంగం సైతం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కేంద్రం చర్యలతో ఈ ప్రాంతంలో మనుగడ కష్టతరంగా మారిందని విమర్శించారు.

ఇదీ చదవండి: కేంద్రం పరిధిలోకి జమ్ముకశ్మీర్​ ​అధికారులు

Last Updated :Feb 8, 2021, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.