ETV Bharat / bharat

కొడుకు పెళ్లిలో రిటైర్డ్​ టీచర్​ ఉదారత.. స్టూడెంట్స్​కు గిఫ్ట్​గా రూ.10 వేల చెక్కులు..

author img

By

Published : Dec 10, 2022, 7:25 PM IST

బిహార్​కు చెందిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు వినూత్నంగా ఆలోచించారు. తన కుమారుడి పెళ్లికి 10 మంది విద్యార్థినిలకు రూ.10 వేల చెక్కును అందించారు. ఆ కథేంటో ఓ సారి తెలుసుకుందాం.

Retired teacher distributed 10 thousand rupees
రిటైర్డ్ టీచర్ దాతృత్వం

కొడుకు పెళ్లిలో రిటైర్డ్​ టీచర్​ ఉదారత.. స్టూడెంట్స్​కు గిఫ్ట్​గా రూ.10 వేల చెక్కులు..

కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా వివాహానికి రూ.లక్షల్లో ఖర్చు చేస్తుంటాం. అందరికీ గుర్తుండిపోయేలా పెళ్లి జరిపించాలని అనుకుంటాం. అయితే బిహార్​లోని మాధేపురాకు చెందిన నిరంజన్​ కుమార్ అనే రిటైర్డ్ టీచర్ మాత్రం​ తన కుమారుడి పెళ్లి సమయంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిభావంతులైన 10 మంది వైద్య, ఇంజినీరింగ్ విద్యార్థినులకు రూ.10 వేల చెక్కులను అందజేశారు. చెక్కును అందుకున్న తర్వాత విద్యార్థినులు నిరంజన్ కుమార్​ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివినా కూడా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని విద్యార్థినులు అన్నారు.

అనేక మంది తమ పరపతిని చాటుకునేందుకు వివాహ సమయంలో రూ.కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని నిరంజన్ కుమార్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి ఖర్చుల్లో కొంత మొత్తాన్ని మిగిల్చి.. దానిని అవసరాల్లో ఉన్న విద్యార్థినిలకు అందజేయడం ద్వారా వారి కష్టాలను కొంతమేర తగ్గించవచ్చని ఆయన చెప్పారు. నిరంజన్ కుమార్​ అంతకుముందు తన కుమార్తె పెళ్లి సందర్భంగా 10 మంది విద్యార్థినిలకు రూ.5వేల చెక్కును అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. రిటైర్డ్ టీచర్ నిరంజన్ కుమార్ కుమారుడు నితేశ్​, అతడి భార్య ఖుష్బూ.. వృత్తి రీత్యా ​రాజస్థాన్‌లోని జైపుర్‌లో స్థిరపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.