ETV Bharat / bharat

Retired Commander Inder Singh Died : పాకిస్థాన్​ 'గాజీ'ని ముంచిన కమాండర్​ కన్నుమూత.. 1971 యుద్ధం గెలుపులో కీలక పాత్ర

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 8:53 AM IST

Retired Commander Inder Singh Died : పాకిస్థాన్​కు చెందిన గాజీ సబ్​మెరైన్​ను ధ్వంసం చేసిన ఐఎన్​ఎస్​ రాజ్​పుత్​కు కమాండర్​గా వ్యవహరించిన ఇందర్ సింగ్​ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం రోహ్​తక్​లోని తన నివాసంలో మరణించారు.

Retired Commander Inder Singh Died
Retired Commander Inder Singh Died

Retired Commander Inder Singh Died : 1971 పాకిస్థాన్​తో యుద్ధం గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ కమాండర్​ ఇందర్​ సింగ్​ కన్నుమూశారు. పాకిస్థాన్​కు చెందిన గాజీ సబ్​మెరైన్​ ముంచిన ఐఎన్​ఎస్​ రాజ్​పుత్​కు కమాండర్​గా వ్యవహరించారు ఇందర్ సింగ్​. 99 ఏళ్ల వయసున్న ఆయన.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆరోగ్యం క్షీణించడం వల్ల.. హరియాణ రోహ్​తక్​లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం షీలా బైపాస్​ రోడ్డులోని శ్మశాన వాటికలో నిర్వహిస్తామని కుటుంబసభ్యులు చెప్పారు.

Inder Singh
రిటైర్డ్ కమాండర్​ ఇందర్​ సింగ్​

సూపర్ ప్లాన్​తో పాకిస్థాన్​ సబ్​మెరైన్​ నాశనం
India Pakistan War 1971 : 1971లో యుద్ధం ప్రారంభమైన సమయంలో డిసెంబర్​ 3న భారత్​కు చెందిన ఐఎన్​ఎస్​ విక్రాంత్​ను ముంచేందుకు గాజీ సబ్​మెరైన్​ను పంపించింది పాకిస్థాన్​. వాస్తవానికి ఈ గాజీ సబ్​మెరైన్​ను అమెరికా నుంచి లీజుకు తీసుకుంది పాకిస్థాన్. అప్పటికి భారత్​ వద్ద ఒక్క జలాంతర్గామి కూడా లేదు. దీనిని భగ్నం చేసేందుకు సూపర్ ప్లాన్ వేసింది భారత్​. విశాఖపట్నంలో ఉన్న ఐఎన్​ఎస్​ రాజ్​పుత్​ను పాకిస్థాన్​ గాజీ సబ్​మెరైన్ వస్తున్న.. పశ్చిమ భాగానికి తరలించింది. పాకిస్థాన్​ దృష్టిని మరల్చేందుకు.. ఐఎన్​ఎస్​ విక్రాంత్​గా కనిపించింది. పాకిస్థాన్​ గాజీ సబ్​మెరైన్​ను గమనించిన ఐఎన్​ఎస్​ రాజ్​పుత్​ కమాండర్​ ఇందర్​ సింగ్​.. దానిపై దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య జరిగిన యుద్ధంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో పాకిస్థాన్​కు చెందిన గాజీ సబ్​మెరైన్​ మునిగిపోయింది.

వీర్​ చక్ర అవార్డు సొంతం
రిటైర్డ్ కమాండర్​ ఇందర్​ సింగ్​ 1924 అక్టోబర్​ 4న రోహ్​తక్​ జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన ఇందర్ సింగ్​.. ఉన్నత విద్య కోసం సోనిపత్​కు వెళ్లారు. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఇందర్ సింగ్​.. తర్వాత సైన్యం వైపు అడుగులు వేశారు. సైన్యంలో చేరిన ఇందర్​ సింగ్​.. 1971 లాంటి కీలక యుద్ధాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తిస్తూ.. ప్రభుత్వం వీర్​ చక్ర అవార్డను ప్రదానం చేసింది.

కార్గిల్ విజయం: సైనిక సమరం.. దౌత్య వ్యూహం

భారత అమ్ములపొదలోకి మరో అస్త్రం.. నౌకాదళంలోకి INS వగీర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.