ETV Bharat / bharat

ICUలో రోగి పాదాలను కొరికిన ఎలుకలు.. కట్టుకట్టేసి సిబ్బంది కవరింగ్​!

author img

By

Published : Jul 25, 2023, 1:24 PM IST

rate bite patient
rate bite patient

Rate Bite Patient : ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. ఓ వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చింది. ఐసీయూలో ఉన్న ఓ రోగి పాదాలను ఎలుకలు కొరికాయి. ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఆస్పత్రి సిబ్బంది కట్టుకట్టేశారు. చివరకు ఏమైందంటే?

Rate Bite Patient : ఐసీయూలో చేరిన ఓ రోగి పాదాలను ఎలుకలు కొరికిన ఘటన ఉత్తరప్రదేశ్​లోని బదాయూలో జరిగింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అపస్మారక స్థితిలో ఉన్న రోగి పాదాలను ఎలుకలు గాయపరిచాయి. రోగి పాదాలకు సిబ్బంది కట్టుకట్టి ఈ విషయాన్ని దాచిపెట్టారు.

అసలేం జరిగిందంటే?
దాతాగంజ్​లోని బుధ్​బజార్​ ప్రాంతానికి చెందిన రామ్​సేవక్ ​గుప్తా.. జూన్​7వ తేదీన జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత అతడిని దిల్లీలో ఆస్పత్రి చేర్పించారు. అత్యవసరంగా చికిత్స ఇప్పించారు. అయినా అతడు కోలుకోలేదు. దీంతో జూన్ 30న బదాయూలోని వైద్య కళాశాలలో చేర్పించారు. అక్కడ గుప్తాను ఐసీయూ వార్డుకు తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న రోగి పాదాలను ఎలుకలు కొరికాయి. ఈ విషయాన్ని దాచిపెట్టి ఐసీయూ సిబ్బంది రోగికి కట్టుకట్టారు. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది.

'ఆస్పత్రి అంతా ఎలుకలే!'
మూడు నాలుగు రోజుల క్రితం ఎలుకలు.. బాధితుడి కాళ్లను కొరికాయని రోగి సోదరుడు రామ్​గుప్తా చెప్పాడు. తరువాత రక్తం రావటం మొదలైందని, ఐసీయూ సిబ్బంది.. తన సోదరుడి పాదాలకు కట్టుకట్టారని తెలిపాడు. ఆస్పత్రిలో చాలా ఎలుకలు ఉన్నాయని అన్నాడు.

'కఠిన చర్యలు తీసుకుంటాం'
ఈ ఘటనపై వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్​సీ ప్రజాపతి స్పందించారు. సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని గుర్తిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆక్సిజన్ పైప్​లైన్ ద్వారా ఎలుకలు వచ్చాయని, మరమ్మతులు చేస్తున్నామని వెల్లడించారు.

రోగి కంటిని కొరికిన ఎలుక
కొన్నిరోజుల క్రితం.. రాజస్థాన్​లో కూడా వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. కోటాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళను ఎలుకలు కరిచాయి. ఆస్పత్రి వర్గాలు మాత్రం ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించాయి.
మహారావ్ భీమ్​సింగ్ వైద్య కళాశాలలో రూపవతి అనే ఓ మహిళా రోగి ఐసీయూలో చికిత్స పొందుతోంది. పక్షవాతం వ్యాధితో ఆమె ఆస్పత్రిలో చేరింది. శరీరంలోని ఏ భాగాన్నీ ఆమె స్వయంగా కదిలించలేదు. కాగా, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆమె కంటిని ఎలుక కొరికింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.