ETV Bharat / bharat

థియేటర్​లో మహిళపై 'ఎలుక' ఎటాక్​ కేసు.. ఐదేళ్ల తర్వాత కోర్టు తీర్పు!.. ఏం చెప్పిందంటే?

author img

By

Published : May 6, 2023, 9:06 AM IST

థియేటర్​లో సినిమా చూస్తుండగా ఓ మహిళను ఎలుక కరిచింది. తీవ్ర వేదనకు గురైన ఆమె వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించింది. సాక్ష్యాలను పరిశీలించిన కమిషన్​.. ఆ మహిళకు పరిహారం కింద రూ.60 వేలు చెల్లించాలని థియేటర్​ యాజమాన్యానికి ఆదేశించింది. అసలు కథేంటంటే?

Rat bite in cinema hall
Rat bite in cinema hall

సినిమా చూసేందుకు థియేటర్​కు వెళ్లి ఎలుక కాటుకు గురైన ఓ మహిళకు రూ.60 వేలు పరిహరం చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్.. థియేటర్​ యాజమాన్యానికి ఆదేశించింది. మెడికల్​ బిల్లు 2 వేల రూపాయలతో పాటు కోర్టు ఖర్చులకు అదనంగా రూ.5 వేలు పేర్కొంది. అసోంలోని గువాహటి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

బాధిత మహిళ లాయర్ కథనం ప్రకారం....
2018 అక్టోబర్​ 20న అనిత అనే మహిళ.. జిల్లాలోని భాంగాఘర్​ ప్రాంతంలో ఉన్న గలెేరియా థియేటర్​లో సినిమా చూసేందుకు తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లింది. సినిమా ఇంటర్వెల్​ సమయంలో తన కాలిని ఓ ఎలుక కొరికింది. వెంటనే ఆమె సినిమా హాలు నుంచి బయటకు పరిగెత్తింది. రక్తస్రావం అవుతున్న అనితకు సినిమా హాలు నిర్వాహకులు ఎలాంటి ప్రథమ చికిత్స అందించకపోగా.. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లటంలోనూ నిర్లక్ష్యం చేశారని లాయర్ ఆరోపించారు.

"అనితను మొదటగా ఏమి కరించిందోనని తెలియని వైద్యులు.. ఆమెను రెండు గంటల పాటు అబ్జర్వేషన్​లో ఉంచారు. తరువాత ఆమె కాలును ఎలుక కొరికిందని నిర్థారణకు వచ్చిన డాక్టర్లు చికిత్స ప్రారంభించారు" అని లాయర్​ వర్మ తెలిపారు. థియేటర్​ యాజమాన్యం పట్ల అసహనం వ్యక్త పరిచిన అనిత జిల్లా వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించింది. తనకు జరిగిన నష్టం, మానసిక వేదనుకుగాను రూ.6 లక్షల పరిహారం ఇవ్వాలని కోరింది.

అయితే ఈ ఘటనపై సినిమా హాలు యాజమాన్యం స్పందించింది. "థియేటర్ ఆవరణను ఎల్లప్పుడు పరిశుభ్రంగానే ఉంచుతాం. ఘటన జరిగిన వెంటనే మేము ప్రథమ చికిత్స అందించేందుకు ప్రయత్నించాం. కానీ ఆమె తిరస్కరించారు" అని నిర్వాహకులు బదులిచ్చారు. అంతేకాకుండా మహిళ ఫిర్యాదును తిరస్కరించి.. తమకు రూ.15 వేలు నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా వినియోగదారుల కమిషన్​ను కోరారు.

సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ప్రేక్షకులకు సరైన సేవలను అందించటంలో హాలు యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని భావించిన వినియోగదారుల కమిషన్​.. బాధితురాలికి పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. మహిళ సమర్పించిన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని బాధితురాలికి రూ.60 వేలు పరిహారం చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 25న తీర్పు వెలువరించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో తీర్పు వెలువడిన తేదీ నుంచి సంవత్సరానికి 12 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఎలుక తోకకు రాయి కట్టి.. ఇటీవలే ఓ ఎలుకకు సంబంధించిన మరో ఘటన కూడా ఉత్తర్​ప్రదేశ్​లో వైరల్​గా మారింది. ఎలుక తోకకు రాయి కట్టి దాన్ని నీళ్లలో ముంచి చంపేసిన ఘటనలో సదరు వ్యక్తిపై పోలీసులు 30 పేజీల ఛార్జ్​షీట్​ దాఖలు చేశారు. ఈ కథనాన్ని పూర్తిగా చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.