ETV Bharat / bharat

కుమారుడి మరణం.. పోసింది ఆరోగ్య కేంద్రానికి ప్రాణం!

author img

By

Published : Jan 24, 2021, 8:10 PM IST

కన్న కొడుకు కళ్ల ముందే చనిపోవడం.. ఆయన జీవితాన్ని మార్చేసింది. తన లాంటి బాధ మరెవరూ అనుభవించకూడదు అనుకున్నాడు. అందుకే.. పేదల కోసం ఉచిత వైద్యశాలను ఏర్పాటు చేసి, సేవలు అందిస్తున్నాడు హరియాణా పానిపట్​వాసి రామ్​స్వరూప్​ చావ్లా.

ramswaroop-of-noorwala-started-dispensary-and-give-free-treatment-to-patients
కుమారుడి మరణం.. ఆ ఆసుపత్రికి పోసింది ప్రాణం!

కుమారుడి మరణం.. పోసింది ఆరోగ్య కేంద్రానికి ప్రాణం!

మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు అప్పటివరకు మనకు ఉన్న ఆలోచనా ధోరణినే మార్చేస్తాయి. కొన్ని సందర్భాల్లో అవే సంఘటనలు.. సాటి మనిషికి సాయపడాలని నేర్పిస్తాయి. హరియాణాలోని ఓ వ్యక్తి జీవితంలోనూ అచ్చం ఇలాగే జరిగింది. ఆ విషాద ఘటన.. పేదల కోసం ఓ ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పి ఉచిత సేవలు అందించేలా చేసింది. ఆయనే పానిపట్​లోని నూర్వా కాలనీకి చెందిన రామ్​స్వరూప్​ చావ్లా. ఆయన నెలకొల్పిన ఆ మినీ ఆసుపత్రికి రోజూ దాదాపు 200 నుంచి 250 మంది చికిత్స కోసం వస్తుంటారు.

అలా నిర్మాణం..

కొన్నేళ్ల క్రితం.. విలియమ్స్​ అనే వ్యాధితో రామ్​స్వరూప్​ కుమారుడు బాధపడేవాడు. ఆ సమయంలో ఆయన​ తన కుమారుడి చికిత్స కోసం ఎన్నో ఆసుపత్రులకు తిరిగారు. అయినప్పటికీ.. ఫలితం దక్కలేదు. కుమారుడు మరణించాడు. ఆ బాధ నుంచి తేరుకున్న అనంతరం.. తనలా మరెవరూ బాధపడుకూడదని నిర్ణయించుకున్నారు. శ్రీరామ్​ దేవ్​ సేవా దల్ సంస్థ​ సహకారంతో ఓ ఉచిత వైద్య చికిత్స కేంద్రాన్ని పదేళ్ల క్రితం ఆయన స్థాపించారు. ఇప్పటికీ ఆ సంస్థకు చెందిన దాదాపు 95మంది.. ఈ ఆరోగ్య కేంద్రానికి ప్రతినెలా రూ.500 విరాళం ఇస్తున్నారు. ఈ మినీ ఆసుపత్రిలో నిత్యం ఇద్దరు వైద్యులు సేవలు అందిస్తున్నారు.

బయట ఆసుపత్రులకు వెళ్తే.. వేలల్లో ఖర్చు అవతుండగా ఈ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా వైద్య సేవలు అందుతుండటం పట్ల స్థానికులు ఎంతో సంతోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.