ETV Bharat / bharat

ఆ విద్యా సంస్థకు రాజీవ్ సద్భావన అవార్డు.. 84మందితో కొత్త CWCని ప్రకటించిన ఖర్గే

author img

By

Published : Aug 20, 2023, 10:50 PM IST

Updated : Aug 20, 2023, 10:58 PM IST

Rajiv Gandhi National Sadbhavana Award : 25వ రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డును.. రాజస్థాన్‌లోని బనస్థలి విద్యాపీఠానికి అందజేశారు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్​ హన్సారీ. కార్యక్రమానికి సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి-CWCని పునర్వ్యవస్థీకరించారు ఖర్గే.

rajiv-gandhi-national-sadbhavana-award-to-banasthali-vidyapith-rajasthan
rajiv-gandhi-national-sadbhavana-award-to-banasthali-vidyapith-rajasthan

Rajiv Gandhi National Sadbhavana Award : రాజస్థాన్‌లోని బనస్థలి విద్యాపీఠానికి.. 25వ రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డును అందజేశారు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్​ హన్సారీ. మహిళల కోసమే నడిచే బనస్థలి విద్యాపీఠానికి.. 2020-21 సంవత్సరానికి గానూ ఈ అవార్డ్​ను​ అందజేశారు. కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ ఛైర్​ పర్సన్​ సోనియా గాంధీ సమక్షంలో.. బనస్థలి విద్యాసంస్థకు చెందిన సిద్ధార్థ శాస్త్రి అవార్డును స్వీకరించారు. దిల్లీలోని జవహార్ భవన్​లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్​ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

క్విట్ ఇండియా ఉద్యమం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 1992 నుంచి వ్యక్తులకు, సంస్థలకు ఈ అవార్డ్​ను అందజేస్తున్నారు. శాంతి, మత సామరస్యం, జాతీయ ఐక్యతకు కృషి చేసే వారికి.. రూ.10లక్షల రివార్డ్​తో అవార్డ్​ను ఇస్తారు. ఏటా రాజీవ్​ గాంధీ జయంతి రోజును దీన్ని బహూకరిస్తారు.

"మత సామరస్యం, శాంతి, జాతీయ ఐక్యత అనే ఆశయాలు ప్రాధాన్యం సంతరించుకున్న వేళ.. సమాజంలో విభజన, ద్వేషం, మతోన్మాదం, పక్షపాత రాజకీయాలకు దారితీసే శక్తులు మరింత చురుగ్గా మారుతున్నాయి." అని అవార్డు ప్రదానోత్సవంలో సోనియా గాంధీ మాట్లాడారు. రాజీవ్​ గాంధీ హయాంలోనే పంచాయతీ రాజ్​ వ్యవస్థలో మహిళకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. స్త్రీలకు ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించటాన్ని ఆమె గుర్తు చేశారు. బనస్థలి విద్యాపీఠం రాజీవ్​ గాంధీ ఆశయాలను నెరవేరుస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.

CWC పునర్వ్యవస్థీకరణ.. గ్రూప్‌-23 సభ్యులకు చోటు..
Congress Working Committee New List : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే.. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి-CWCని పునర్వ్యవస్థీకరించారు. స్టీరింగ్‌ కమిటీ స్థానంలో 84మందితో నూతన CWCని ఏర్పాటు చేశారు. ఇందులో 15 మంది మహిళలతోపాటు పార్టీ అధినాయకత్వంపై ప్రశ్నలు సంధించిన గ్రూప్‌-23 సభ్యుల్లో కొందరికి కూడా చోటుకల్పించారు. కొత్త CWCలో 39మంది సాధారణ సభ్యులు కాగా .. కొంతమంది రాష్ట్రాల బాధ్యులుసహా 32మంది శాశ్వత ఆహ్వానితులు, యువజన కాంగ్రెస్‌ విభాగం, NSUI, మహిళా కాంగ్రెస్‌, సేవాదళ్‌ అధ్యక్షులుసహా 13మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు.

సాధారణ సభ్యులుగా మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీ, అధీర్‌రంజన్‌ చౌదరీ, ఆంటోనీ, అంబికాసోనీ, మీరాకుమార్‌, దిగ్విజయ్‌ సింగ్‌, పి.చిదంబరం, ప్రియాంకాగాంధీ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్‌ అధినాయకత్వంపై ప్రశ్నలు సంధించిన శశిథరూర్‌, ఆనంద్‌శర్మ, ముకుల్‌ వాస్నిక్‌.. కొత్త CWCలో సాధారణ సభ్యులుగా నియమితులయ్యారు. ఆ గ్రూప్‌కే చెందిన మనీశ్‌ తివారీ, వీరప్పమొయిలీ శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నారు. పంజాబ్‌ మాజీ సీఎం చరణ్‌జీత్‌ చన్నీ, ప్రతిభాసింగ్‌లు CWC సాధారణ సభ్యులని కాంగ్రెస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. రాజస్థాన్‌లో గహ్లోత్‌ సర్కార్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన సచిన్‌ పైలెట్‌కు కూడా కొత్త CWCలో చోటుదక్కింది

చంద్రయాన్​ 3 ల్యాండింగ్​ సమయంలో మార్పు.. దేశమంతా లైవ్​కు ఇస్రో ఏర్పాట్లు

'చైనా ఆక్రమణలో భారత భూభాగం'.. రాహుల్ వ్యాఖ్యలపై దుమారం.. కేంద్ర మంత్రి కౌంటర్

Last Updated : Aug 20, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.