ETV Bharat / bharat

Railway Ticket Confirmation Rules : రిజర్వేషన్ చేసుకున్న టికెట్లు వేరేవాళ్లకు.. రైల్వే శాఖకు రూ.40 వేలు ఫైన్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 11:02 AM IST

Railway Ticket Confirmation Rules : తమ కుటుంబ సభ్యుల కోసం బుక్​ చేసుకున్న రైలు టిక్కెట్​లను వేరే వాళ్లకు కేటాయించినందుకు గానూ భారతీయ రైల్వేకు రూ.40 వేల జరిమానా విధించింది వినియోగదారుల కమిషన్. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

40 Thousand Fine Levied To Indian Railways
40 Thousand Fine To Indian Railways

Railway Ticket Confirmation Rules : ముందుగా తమకు కేటాయించిన రిజర్వ్​డ్​ సీటును వేరే వ్యక్తులకు ఎలా కేటాయిస్తారన్న విషయంపై కోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తికి.. రూ.40 వేల నష్టపరిహారం చెల్లించాలని భారతీయ రైల్వే శాఖను ఆదేశించింది బెంగళూరులోని వినియోగదారుల కమిషన్​.

అదనంగా చెల్లించి ప్రయాణం..
కర్ణాటక.. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటున్న అలోక్‌ కుమార్‌ అనే వ్యక్తి 2022 మార్చి 15న తల్లిదండ్రులు, అతడి ప్రయాణం కోసం ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​లో టికెట్స్​ బుక్​ చేశాడు. మే 21న దిల్లీ నుంచి బిహార్​లోని బరౌనీకి వెళ్లేందుకు రాజధాని ఎక్స్​ప్రెస్​ రైలులో రూ.6,995 చెల్లించి సీట్లను రిజర్వ్​ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ప్రయాణం రోజున రైలు ఎక్కే సమయంలో ప్రయాణికుల పీఎన్​ఆర్​ (PNR) నంబర్​ సరిగ్గానే ఉందని.. కానీ టికెట్​ ఇంకా కన్ఫామ్​ కాలేదని రైల్వే సిబ్బంది చెప్పారు. అందుకే వెంటనే రైలు దిగిపోవాలని.. లేదంటే ఫైన్​ చెల్లించి ప్రయాణం కొనసాగించాలని రైల్వే సిబ్బంది సూచించారు. దీంతో వెంటనే ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు అలోక్​ కుమార్​ ఐఆర్‌సీటీసీని ఫోన్​, ఈ-మెయిల్​ ద్వారా సంప్రదించాడు. అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల చేసేదేమీలేక అధికారులు చెప్పినట్లుగా అదనంగా రూ.22,300 జరిమానాను చెల్లించి ప్రయాణం చేశారు. ఆ తర్వాత అదనంగా చెల్లించిన ఈ ఫైన్​ను వసూలు చేసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.

కోర్టు ఖర్చులతో సహా..
ఈ పరిణామాలతో విసుగు చెందిన అలోక్​ కుమార్​ తనకు జరిగిన అన్యాయానికి బాధ్యులైన ఐఆర్​సీటీసీ, భారతీయ రైల్వేపై జిల్లా కస్టమర్ రిడ్రెసల్ కమిషన్​లో ఫిర్యాదు చేశారు. ముందుగానే టికెట్స్​ బుక్​ చేసుకున్నా అదనంగా చెల్లించిన రూ.22,300లను తిరిగి పొందేలా సదరు సంస్థకు ఆదేశాలు ఇవ్వాలని ఫిర్యాదులో అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి రైల్వే శాఖకు నోటీసులు జారీ చేసింది వినియోగదారుల కమిషన్​. అయినా అక్కడి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాగా, ఈ వ్యవహారంలో తమ పాత్ర ఏమీ లేదని.. రైల్వే శాఖ నిర్ణయమే అంతిమమని ఐఆర్​సీటీసీ కమిషన్​కు తేల్చి చెప్పింది. దీంతో సంబంధిత అన్ని పత్రాలను పరిశీలించిన జిల్లా వినియోగదారుల కమిషన్​లోని త్రిసభ్య ధర్మాసనం భారతీయ రైల్వేకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. సదరు ప్రయాణికుడికి రూ.40 వేలు చెల్లించాలని ఆదేశించింది.

DA Hike For Railway Employees : రైల్వే ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. 4 శాతం DA పెంచిన కేంద్రం

How To Get Lost Things In Train : రైలు ప్రయాణంలో మీ లగేజీ పోగొట్టుకున్నారా?.. అయితే మీ వస్తువులను తిరిగి పొందండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.