ETV Bharat / bharat

కాంగ్రెస్​ అధ్యక్షుడిగా 'రాహుల్'​ రీఎంట్రీ ఫిక్స్​!

author img

By

Published : Oct 16, 2021, 5:14 PM IST

congress president
రాహుల్​

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ (Rahul gandhi news).. పార్టీ అధ్యక్ష పదవిని తిరిగిచేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై నేతల నుంచి ఎంతో కాలంగా డిమాండ్లు పెరుగుతున్నా.. ఇప్పటివరకు మౌనంగా ఉన్న రాహుల్​.. తాజాగా జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో(congress cwc meeting) 'ఈ విషయంపై ఆలోచిస్తాను' అని స్పందించడం ఇందుకు కారణం. మరోవైపు అధ్యక్ష ఎన్నికలు 2022 ఆగస్టు-సెప్టెంబర్​ మధ్య కాలంలో జరగనున్నట్టు కాంగ్రెస్(congress president news)​ ప్రకటించింది.

కాంగ్రెస్​ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రాహుల్​ గాంధీ(rahul gandhi news) నుంచి ఎట్టకేలకు సానుకూల స్పందన వచ్చింది. దిల్లీలో శుక్రవారం.. సీడబ్ల్యూసీ సమావేశం(congress cwc meeting) జరగ్గా రాహుల్​ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని నేతలు మరోమారు డిమాండ్​ చేసినట్టు తెలుస్తోంది(congress news). ఈ విషయంపై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న రాహుల్​.. తాజాగా జరిగిన భేటీలో 'అధ్యక్ష పదవి గురించి ఆలోచిస్తాను' అని వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయంపై సిద్ధాంతాల స్థాయి నుంచి స్పష్టత అవసరమని, రాజకీయ నేతలు తమ నిర్ణయాన్ని వెల్లడించాలని రాహుల్​ తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేంత వరకు రాహుల్​.. కాంగ్రెస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగాలని పలువురు సీనియర్లు అభిప్రాయపడినట్టు సమాచారం.

2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం అనంతరం కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్​. ఆ తర్వాత సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అయితే రాహుల్​ తిరిగి పదవిని చేపట్టాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికలు అప్పుడే..

సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్​ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు 2022 ఆగస్టు 21- సెప్టెంబర్​ 20 మధ్య జరుగుతుందని(congress president election) పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ ప్రకటించారు.

  • సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌కు సీడబ్ల్యూసీ ఆమోదం
  • నవంబర్ 1 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం
  • 2022 ఏప్రిల్‌లో అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ
  • 2022 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు సీడబ్ల్యూసీ సభ్యుల ఎన్నిక
  • 2022 అక్టోబర్ 31 నాటికి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తి

పార్టీలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు భారీ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వేణుగోపాల్​ వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై కార్యకర్తలు, నేతలకు ట్రైనింగ్​ ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.

3 తీర్మానాలు..

దేశంలో రైతులపై జరుగుతున్న దాడులు, వ్యవసాయ రంగం దుస్థితి, రాజకీయ పరిస్థితులకు వ్యతిరేకంగా మూడు తీర్మానాలను పార్టీ ఆమోదించినట్టు వేణుగోపాల్​ తెలిపారు.

ఇదీ చూడండి:- కాంగ్రెస్​ పార్టీకి నేనే ఫుల్​టైమ్​ అధ్యక్షురాలిని: సోనియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.