హిందూ మతం, హిందుత్వం.. ఈ రెండూ వేరు: రాహుల్​ గాంధీ

author img

By

Published : Nov 12, 2021, 3:54 PM IST

rahul gandhi news

కాంగ్రెస్ చేపట్టిన డిజిటల్ కార్యక్రమం​ 'జన్​ జాగరణ్​ అభియాన్​'ను(jan jagran abhiyan) వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా శుక్రవారం ప్రారంభించారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ(rahul gandhi news). ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. హిందూ మతం, హిందుత్వం.. రెండు వేర్వేరు విషయాలన్నారు(congress party news today).

హిందూ మతం, హిందుత్వం.. రెండు వేర్వేరు విషయాలని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ(rahul gandhi news) వ్యాఖ్యానించారు. ఒకవేళ అవి ఒకటే అయితే వాటికి రెండు పేర్లు ఎందుకున్నాయన్నారు.

కాంగ్రెస్​ చేపట్టిన 'జన్​ జాగరణ్​ అభియాన్​'(jan jagran abhiyan) డిజిటల్​ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు రాహుల్​. భాజపా, కాంగ్రెస్​ సిద్ధాంతాల మధ్య వైరుద్ధ్యాల గురించి మాట్లాడారు.

"హిందూ మతానికి, హిందుత్వానికి మధ్య బేధాలేంటి? ఆ రెండు ఒకటి కాదా? ఆ రెండు కచ్చితంగా ఒకటి కాదు. హిందూ మతం అంటే సిక్కును, ముస్లింలను కొట్టడమా? కానీ హిందుత్వం అంటే అదే! ఈ రోజున ఆర్​ఎస్​ఎస్​, భాజపా విద్వేషపూరిత భావజాలం.. కాంగ్రెస్​కున్న ప్రేమించే గుణం, మనం చూపించే ఆప్యాయత, పార్టీ జాతీయవాద సిద్ధాంతాన్ని పూర్తిగా అధిగమించేసింది. ఇది వాస్తవం. మన సిద్ధాంతాలు సజీవంగానే ఉన్నాయి. కానీ వారి సిద్ధాంతాలు పైచేయి సాధించాయి. మన సిద్ధాంతాలను, మన ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నాము. అందుకే ఇలా జరుగుతోంది."

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 14 నుంచి 29 వరకు జన్​ జాగరణ్​ అభియాన్​ కార్యక్రమాన్ని చేపట్టనుంది కాంగ్రెస్​(congress party news today).

'జాతీయ భద్రతపై రాజీ...'

మరోవైపు.. చైనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద సరైన వ్యూహాలు లేవని, అందుకే జాతీయ భద్రత విషయంలో క్షమించలేనంతగా రాజీ పడిందని రాహుల్​ గాంధీ ట్విట్టర్​లో మండిపడ్డారు. చైనాతో సరిహద్దు వివాదంపై త్రిదళాధిపతి బిపిన్​ రావత్​, భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యలు వేరువేరుగా ఉన్నాయంటూ ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

భారత భూభాగంలోకి చైనా వచ్చి కొత్త గ్రామాన్ని నిర్మించుకుందనేది అవాస్తవమని బిపిన్​ రావత్​ గురువారం వ్యాఖ్యానించారు. ఆ గ్రామం.. చైనా పరిధిలోని వాస్తవాధీన రేఖ వద్ద ఉందని తెలిపారు. అయితే తమ భూభాగంలో చైనా చేపట్టిన ఆక్రమణలను భారత్​ ఎప్పుడూ గుర్తించదని విదేశాంగశాఖ వెల్లడించింది.

అరుణాచల్​ప్రదేశ్​లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూభాగంలో చైనా గ్రామాన్ని నిర్మించుకుందని అమెరికా ఇటీవలే ఓ నివేదికను విడుదల చేసింది.

ఇదీ చూడండి:- ''రివర్స్​ గేర్'​లో మోదీ అభివృద్ధి వాహనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.