ETV Bharat / bharat

'పంజాబ్​ సీఎం'కు ప్రధాన సలహాదారుగా ప్రశాంత్​ కిశోర్​

author img

By

Published : Mar 1, 2021, 6:03 PM IST

Punjab CM says Prashant Kishor has joined him as principal advisor
అమరీందర్​ ప్రధాన సలహాదారుగా ప్రశాంత్​ కిశోర్​

పంజాబ్​లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్​ కసరత్తు ముమ్మరం చేసింది. 2022లో అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన వ్యూహరచన కోసం ప్రశాంత్​ కిశోర్​ను.. ముఖ్యమంత్రి అమరీందర్​కు​ ప్రధాన సలహాదారుగా నియమించింది.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​.. తన ప్రధాన సలహాదారుగా చేరినట్టు పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ సోమవారం వెల్లడించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ ప్రశాంత్​ కిశోర్​ నియమకానికి ఆమోదించింది. ఈ విషయమై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ప్రశాంత్​తో కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని ట్వీట్​ చేశారు. పంజాబ్​లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్​ ఈ విధమైన చర్యలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

2017 శాసనసభ ఎన్నికల్లోనూ పంజాబ్​లో కాంగ్రెస్​ వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టింది ప్రశాంత్​ నేతృత్వంలోని రాజకీయ సలహాదారు సంస్థ ఐ-ప్యాక్(ఇండియన్ పొలిటికల్ యాక్షన్​ కమిటీ). ఆ ఎన్నికల్లో 117 అసెంబ్లీ స్థానాలకు గానూ.. కాంగ్రెస్​ 77 స్థానాల్లో విజయం సాధించింది. ప్రశాంత్​ ప్రస్తుతం.. బంగాల్​ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్​ అధికారంలోకి రావడంలో ఆయనే కీలక పాత్ర పోషించారు.

స్థానిక పరిస్థితులకు తగినట్లు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రచించే సంస్థగా ఐ-ప్యాక్​కు మంచి పేరుంది.

ఇదీ చదవండి: 200 రాకపోతే తప్పుకుంటారా?: ప్రశాంత్​ సవాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.