ETV Bharat / bharat

ఆమె పెళ్లికి శ్మశానమే కల్యాణ మండపం.. ఎందుకో తెలుసా..?

author img

By

Published : Feb 7, 2023, 3:44 PM IST

Poor Girl Marriage In Graveyard
శ్మశానంలో పేద ఆడపిల్ల వివాహం

పంజాబ్​లోని ఓ గ్రామ ప్రజలు పెద్ద మనసును చాటుకున్నారు. తమ సొంత ఖర్చులతో ఓ పేద అమ్మాయి పెళ్లిని శ్మాశానంలో చేశారు. అంతేగాక ఊర్లోని తమ పిల్లల వివాహాలు కూడా శ్మశానంలోనే నిర్వహిస్తామని చెబుతున్నారు ఇక్కడి పెద్దలు.

శ్మశానంలో పేద యువతి వివాహం

ఇప్పటి వరకు మీరు చాలా రకాల పెళ్లిళ్లు చూసి ఉంటారు.. ఒకరు సముద్రంలో పెళ్లి చేసుకుంటే, మరొకరు గాల్లో వివాహం చేసుకుంటారు.. కానీ ఈ పెళ్లి మాత్రం కాస్త స్పెషల్. ఎందుకంటే అశుభానికి సూచకంగా చూసే శ్మశానంలో శుభకార్యమైన పెళ్లిని జరిపించారు పంజాబ్​లోని ఓ గ్రామ ప్రజలు.
పంజాబ్​ రాష్ట్రంలో ఓ వింత వివాహం జరిగింది. ఒక పేద అమ్మాయికి తమ సొంత ఖర్చులతో శవాలను దహనం చేసే శ్మశానవాటికలో పెళ్లి జరిపించారు అమృత్​సర్ జిల్లాలోని​ మోహకాంపుర గ్రామస్థులు. దీంట్లో ప్రత్యేకమేముంది అంటారా? ఈ గ్రామంలో చాలా కాలంగా ఓ వృద్ధురాలు తన మనవరాలితో కలిసి శ్మశానవాటికలో జీవిస్తోంది. వారి నిజాయితీ, ఆప్యాయతల కారణంగా ఇద్దరూ ఇక్కడి ప్రజల మనసుల్లో నిలిచిపోయారు.

ఈ క్రమంలో అమ్మాయి పెళ్లి వయస్సుకు రావడం వల్ల ఆ ప్రాంత వాసులే సంబంధం చూసి మరీ వివాహం జరిపించారు. విశేషమేంటంటే శ్మశానంలో నివసించే అమ్మాయికి పెళ్లి చేయించడమే కాకుండా బరాత్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడి వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. "శ్మశానం లోపల ఓ చిన్నగదిలో వృద్ధురాలు, అమ్మాయి ఉంటున్నారు. ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో వీరు ఉండేవారు. అటువంటి కుటుంబంలోని ఆడబిడ్డకు వివాహం జరిపించడం మాకెంతో గర్వంగా ఉంది" అని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ దహన వాటికలపై కొందరికి భిన్నాభిప్రాయాలున్నాయని.. అయితే ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఇలానే వివాహం చేసుకుంటారని గ్రామస్థులు తెలిపారు.
ఊరి పెద్దల సహకారంతో తన మనవరాలు మెట్టినింటికి వెళ్తోందని సంతోషం వ్యక్తం చేసింది వధువు అమ్మమ్మ ప్రకాశ్ కౌర్. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.