ETV Bharat / bharat

చికెన్ కబాబ్ తిని అస్వస్థత.. 137 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్

author img

By

Published : Feb 7, 2023, 12:29 PM IST

karnataka Food Poison case
ఫుడ్ పాయిజన్

చికెన్ కబాబ్ తిన్న 137 మంది నర్సింగ్ విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరు సమీపంలో జరిగింది.

కర్ణాటక మంగళూరులో హాస్టల్ ఫుడ్ తిన్న కొంతమంది నర్సింగ్ విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్​ అయింది. ఈ ఘటనలో 137 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నగరంలోని సిటీ నర్సింగ్ కాలేజీకి చెందిన ఓ విద్యార్థిని ఆదివారం రాత్రి ఘీ రైస్, చికెన్ కబాబ్ తిని అస్వస్థతకు గురైంది. సోమవారం తెల్లవారుజామున మరికొంతమంది విద్యార్థినిలకు వాంతులు, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో వారందరినీ పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సోమవారం 100కు పైగా విద్యార్థినులు కాలేజీకి హాజరు కాలేదు. దీంతో వారు ఎందుకు రాలేదని ఆరాతీయగా.. ఫుడ్ పాయిజన్ విషయం వెలుగులోకి వచ్చింది. రాత్రి వరకు సుమారు 400 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆస్పత్రి ముందు గుమిగూడారు. ఏం జరిగిందని పోలీసులు ఆరా తీయగా వారికి ఫుడ్ పాయిజన్ గురించి తెలిసింది. "ఆదివారం రాత్రి హాస్టల్​ మెస్​లో ఘీ రైస్, చికెన్ కబాబ్ వడ్డించారు. అవి తిన్నాక మేమంతా అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రులలో చేరాము. ఈ విషయం తెలియగానే పోలీసులు హాస్పిటల్స్​కు వెళ్లి సమాచారం సేకరించారు" అని ఓ విద్యార్థిని చెప్పింది.

ఈ ఘటన నేపథ్యంలో జిల్లా అధికారులు తనిఖీలు చేపట్టారు. హాస్టల్స్​కు వెళ్లి విద్యార్థినులు తినే ఆహార నమూనాలను సేకరించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను, డాక్టర్లను సంప్రదించి వివరాలను తెలుసుకున్నారు. "చాలామంది విద్యార్థులు భయంతో హాస్పిటల్​లో చేరనన్నారు. కొందరు విద్యార్థులు డీహైడ్రేషన్​కు గురవుతున్నారు. బీపీ నిలకడగా ఉంది. చాలా మంది విద్యార్థునులు త్వరలో డిశ్చార్జ్ కానున్నారు. విద్యార్థుల ప్రాణానికేమి ప్రమాదం లేదు" అని ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అశోక్ స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.