ETV Bharat / bharat

మనీలాండరింగ్ కేసు- ఛార్జ్​షీట్​లో ప్రియాంక గాంధీ పేరు చేర్చిన ఈడీ, రాబర్ట్​ వాద్రాకు సైతం!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 1:43 PM IST

Updated : Dec 28, 2023, 5:22 PM IST

Priyanka Gandhi Ed Case : మనీలాండరింగ్​కు సంబంధించిన కేసులో దాఖలు చేసిన ఛార్జ్​షీట్​లో ఈడీ కాంగ్రెస్​ నాయకురాలు ప్రియాంకగాంధీ పేరును చేర్చింది. అయితే ప్రియాంకను నిందితురాలిగా మాత్రం పేర్కొనలేదు. ఇదే ఛార్జ్‌షీట్‌లో ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరు కూడా ప్రస్తావించింది.

Priyanka Gandhi Ed Case
Priyanka Gandhi Ed Case

Priyanka Gandhi Ed Case : నగదు అక్రమ చలామణీ అభియోగాలతో ఆయుధాల వ్యాపారి సంజయ్‌ భండారీపై నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఈ మనీలాండరింగ్‌ కేసులో ప్రియాంక పేరును ప్రస్తావించిన ఈడీ ఇటీవలే ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా పేరును కూడా జత చేసింది.

దిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ద్వారా హరియాణాలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన వాద్రా తర్వాత సంజయ్‌ భండారీ మిత్రుడు NRI, వ్యాపారవేత్త సీసీ థంపికి విక్రయించినట్లు ఈడీ ఛార్జ్​షీట్​లో తెలిపింది. 2006లో ఫరీదాబాద్‌లో ఆ వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి, 2010లో ఆ భూమిని అదే ఏజెంట్‌కు విక్రయించడంలో ప్రియాంక ప్రమేయం ఉందని ఈడీ తన అభియోగాల్లో తెలిపింది. ఆ ఏజెంట్‌ కొంత భాగాన్ని థంపికి కూడా విక్రయించాడని ఛార్జ్​షీట్​లో పేర్కొంది. ఆ లావాదేవీలు వాద్రా, థంపి మధ్య భాగస్వామ్య సంబంధాలు, పరస్పర వ్యాపార ప్రయోజనాలను వెల్లడి చేస్తున్నాయని తన అభియోగాల్లో తెలిపింది. భండారీ తన అక్రమ ఆర్జనతో లండన్‌లో దక్కించుకున్న 12 బ్రియాన్‌స్టోన్‌ స్క్వేర్‌ అనే ఇంటికి రాబర్ట్‌ వాద్రా మరమ్మతులు చేయించారని, అందులో నివాసం కూడా ఉన్నారని ఈడీ మంగళవారం ఆరోపించింది. బ్రిటన్‌కు చెందిన సుమిత్‌ చడ్ఢా అనే వ్యక్తి, వాద్రాకు ఈ వ్యవహారంలో సహకరించారని చెప్పింది. ఈ కేసులో నిందితుడైన భండారీ 2016లోనే బ్రిటన్‌కు పారిపోయారు. ఆయన్ను వెనక్కి తీసుకొచ్చేందుకు ఈడీ, సీబీఐ చేసిన వినతికి బ్రిటన్‌ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఆమోదం తెలిపింది.

  • #WATCH | On Priyanka Gandhi Vadra named in ED's PMLA case chargesheet, Karnataka Cong chief DK Shivakumar in Nagpur says, "...They (BJP) feel we are afraid of going to jail. No one is afraid of it. We know the law of the land. They can't use these institutions to threaten us. To… pic.twitter.com/djsTYqg7o8

    — ANI (@ANI) December 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'బీజేపీ చర్యలకు భయపడేది లేదు'
మరోవైపు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తమ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ పేరును చేర్చడంపై కర్ణాటక కాంగ్రెస్​ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. 'వారు(బీజేపీ) మేము జైలంటే భయపడతామని అనుకుంటున్నారు. వారి చర్యలకు ఎవరూ బయపడేది లేదు. ఇలాంటి సంస్థల్ని(ED) ఉపయోగించి మా పార్టీ నేతల్ని బయపెట్టలేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మేము పోరాడుతూనే ఉంటాం' అని ఆయన వివరించారు.

  • #WATCH | On Congress leader Priyanka Gandhi Vadra's name in ED chargesheet, Maharashtra Congress president Nana Patole says, "BJP is a party that is scared of Congress. The British were scared of Gandhi then and even today the central govt is scared of the Gandhi family. BJP is… pic.twitter.com/g22WbJyjdp

బీజేపీ ట్విస్ట్​.. రాబర్ట్ వాద్రాకు క్లీన్​చిట్.. ​ఆ ల్యాండ్​ స్కామ్​​ జరగలేదట!

క్రిమినల్​తో రాబర్ట్​ వాద్రా ఫొటో- సోషల్​ మీడియాలో వైరల్​

Last Updated : Dec 28, 2023, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.