ETV Bharat / bharat

జైలులో ఉన్న భర్తను కలవడానికి వెళ్లి.. గుండెపోటుతో కుప్పకూలిన గర్భిణీ

author img

By

Published : Jun 8, 2023, 6:58 AM IST

Updated : Jun 8, 2023, 8:06 AM IST

జైలులో ఉన్న భర్తను కలవడానికి వెళ్లిన ఓ గర్భవతి గుండెపోటుకు గురై మరణించింది. ఈ ఘటన బిహర్​లోని భాగల్​పుర్ జిల్లాలో జరిగింది.

Pregnant Women Died In Jail
పల్లవి మరణించడం వల్ల రోదిస్తున్న కుటుంబీకులు

హత్యాయత్నం కేసులో జైలులో ఉన్న భర్తను కలవడానికి వెళ్లిన ఓ గర్భవతి గుండెపోటుతో​ మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన బిహార్​లోని భాగల్​పుర్ జిల్లాలో జరిగింది. గోగా పట్టణానికి చెందిన పల్లవి, గోవింద్​ యాదవ్​లకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారి జీవితం ఆనందంగా సాగిపోతున్న సమయంలో గోవింద్​ హత్యాయత్నం కేసులో అరెస్టయ్యాడు. ఏడు నెలల నుంచి జైలులోనే ఉన్నాడు. దీంతో పల్లవి మనస్తాపనికి గురైంది. బిడ్డను కనడానికి ముందు భర్తను కలవలనుకుంది.

గర్భవతిగా ఉన్న పల్లవిని జైలుకు పంపడానికి ఇష్టపడని ఆమె అత్తమమాలు అందుకు నిరాకరించారు. కానీ ఆమె పట్టుపట్టడంతో వారు కాదనలేకపోయారు. దీంతో పల్లవి మంగళవారం భర్తను చూసేందుకు జైలుకు వెళ్లింది. కాసేపు భర్తతో కష్టసుఖాలు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి నేలపై పడిపోయింది. ఇది గమనించిన అక్కడి సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధరించారు.

Pregnant Women Died In Jail
రోధిస్తున్న కుటుంబీకులు

'పల్లవి యాదవ్ అనే మహిళ తన భర్త గోవింద్ యాదవ్ అలియాస్ గుడ్డు యాదవ్‌ను కలిసేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించి అక్కడే నేలపై పడింది. ఆ తర్వాత చనిపోయింది. ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది' అని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ పేర్కొన్నారు. అయితే, తప్పుడు కేసులో తమ కుటుంబ సభ్యుడిని ఇరికించారని జైలులో ఉన్న వ్యక్తి బంధువులు ఆరోపిస్తున్నారు.

"ప్రతిపక్షాలు ఇచ్చిన డబ్బుకు ఆశపడి పోలీసులు మా అన్నయ్యపై అక్రమ కేసు పెట్టారు. బలవంతంగా మా అన్నయ్యను జైలులో వేశారు. అదే మా వదిన మరణానికి కారణం."
-విక్కీ యాదవ్​, మృతురాలి మరిది

మహారాష్ట్రలో మహిళ హత్య...
ఠాణె జిల్లాలో దారుణం జరిగింది. మీరా రోడ్డు ప్రాంతంలోని ఓ అపార్ట్​మెంట్​లో ముక్కలుగా కోసిన మహిళ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే.. హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

'మృతురాలిని సరస్వతి వైద్య (32) గా గుర్తించాం. సరస్వతి, మనోజ్ సహాని (56) సహ జీవనం చేస్తున్నారు. గత మూడేళ్లుగా వీరిద్దరూ స్థానికంగా ఉన్న ఆకాశగంగా అపార్ట్​మెంట్​లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఫ్లాట్​ నుంచి దుర్వాసన వస్తోందంటూ పొరుగు ఫ్లాట్​వారు మాకు సమాచారం అందించారు. దీంతో మేము ఫ్లాట్​కు చేరుకొని తనిఖీ చేయగా.. సరస్వతి చనిపోయి ఉంది. మనోజ్​ ఆమెను హత్య చేసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నాం. మరిన్ని వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది' - ముంబయి డీసీపీ జయంత్.

Last Updated :Jun 8, 2023, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.