ETV Bharat / bharat

నా కుమార్తెది ఆత్మహత్య కాదు.. హత్యే.. : ప్రీతి తండ్రి

author img

By

Published : Feb 27, 2023, 11:20 AM IST

preethi father
preethi father

Preethi Father Dharawat Narender comments: వైద్యవిద్యార్థిని ప్రీతి మృతదేహం జనగామ జిల్లా, గిర్నితండాకు చేరుకుంది. ఆమెకు కడసారి నివాళులు అర్పించేందుకు బంధువులు, కుటుంబసభ్యలు తండాకు చేరుకుంటున్నారు. తన కూతురిది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికి హత్యేనని తండ్రి ధరావత్ నరేందర్ స్పష్టంచేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

నా కుమార్తెది ఆత్మహత్య కాదు.. హత్యే.. : ప్రీితి తండ్రి

Preethi Father Dharawat Narender comments: జనగామ జిల్లా, గిర్నితండాలో వైద్య విద్యార్థిని ప్రీతి మృతదేహానికి బంధువులు, కుటుంబసభ్యులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రీతి మృతితో కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రుల ఆవేదన చూసి వారు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రీతి తండ్రి ధరావత్ నరేందర్ డిమాండ్ చేశారు. ప్రీతి లాంటి అమ్మాయి మరొకరు బలికాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ కుటుంబంలో ఎవరూ ఇంత చదువుకోలేదని అన్నారు. తన అమ్మాయిని చూసి గొప్పగా అనుకున్నామని వివరించారు. ఆస్తులమ్మి వారిని చదివించామని చెప్పారు. పిల్లలే తమ ఆస్తిపాస్తులనుకున్నామని అన్నారు. కానీ ఆశలన్ని ఆడియాశలయ్యాయని విచారం వ్యక్తం చేశారు. తమ కూతురిది ఆత్మహత్యకాదు హత్యేనని స్పష్టం చేశారు. ప్రీతి పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇవ్వలేదని తెలిపారు.

నిందితుడు సైఫ్‌తో పాటు వేరే వారు ఉన్నారని ధరావత్ నరేందర్ తెలిపారు. సిట్టింగ్ జడ్జితో ఈ కేసును విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో వారు అందరూ ఎక్కడా బయటకు వస్తామో అని ప్రిన్సిపాల్ మంచివారని ప్లకార్డులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రీతి ఆడియోలు ఇంకా ఉన్నాయని వివరించారు. డిసెంబర్ నుంచే ఇలా కొనసాగుతోందని చెప్పారు. మా అమ్మాయితో పాటు ఆమె ఉన్నత ఆశయాలన్ని ఆడిశయాలయ్యాయి అన్నారు.

ఐదు రోజులపాటు మృతువుతో పోరాడి ప్రీతి ఓడిపోయింది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మరణించింది. ప్రాణాలతో క్షేమంగా బయటకు వస్తుందన్న కుమార్తె విగతాజీవిగా రావడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైద్యవిద్యార్థిని ప్రీతి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. దర్యాప్తులో దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని వివరించారు. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, మంత్రి ఎర్రబెల్లి 20 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రీతి మృతిపై మంత్రులు హరీశ్​రావు, , గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్​రావు, సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, సత్యవతి రాఠోడ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంతాపం ప్రకటించారు. వైద్య విద్యార్థిని ప్రీతి మృతదేహానికి కుటుంబసభ్యులు, బంధువులు కడసారి నివాళులు అర్పిస్తున్నారు. గిర్నితండాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చదవండి: ఐదు రోజులు మృత్యువుతో పోరాడి.. ఓడిన మెడికో ప్రీతి!

ప్రీతి మృతి పట్ల కేసీఆర్, మంత్రులు సంతాపం... పరిహారం ప్రకటన

మేఘాలయ, నాగాలాండ్​లో బారులు తీరిన ఓటర్లు.. ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.