ప్రియాంకను చూస్తే రాహుల్​కు భయం.. పీకే సంచలన వ్యాఖ్యలు!

author img

By

Published : Oct 17, 2021, 12:09 PM IST

Prashant Kishore's statement brews trouble for Congress
ప్రియాంకను చూస్తే రాహుల్​కు భయం ()

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్ (Prashant kishor)​.. కాంగ్రెస్​ పార్టీలో మరో వివాదానికి తెరతీశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సామర్థ్యాలను చూసి రాహుల్​ గాంధీ(Rahul Gandhi news) భయపడుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్​ను చిక్కుల్లో పడేసే ప్రమాదముంది.

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీపై (Rahul Gandhi news) విమర్శలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్ (Prashant kishor)​. తన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సామర్థ్యాలను చూసి రాహుల్​ భయపడుతున్నారని ఆరోపించారు. ప్రియాంక అచ్చం తన నానమ్మ, దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీలానే ఉంటారని, ఆమెలో బలమైన నాయకత్వ లక్షణాలున్నాయని అన్నారు. 2017 ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ​ ఎన్నికల్లో (UP election 2022) కాంగ్రెస్​ సీఎం అభ్యర్థిగా.. ప్రియాంకను ప్రకటించకపోవడానికి ఇదే కారణమని చెప్పారు. ఓ టీవీ ఛానల్​తో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

''ప్రియాంకా గాంధీ.. తన నానమ్మ, దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పోలి ఉంటారు. ఆమెలో బలమైన నాయకత్వ లక్షణాలను ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రియాంకలో ఉన్న ఈ లక్షణాలే.. రాహుల్​ను భయపెడుతున్నట్లున్నాయి. అందుకే 2017 ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల(UP election 2022) కోసం.. కాంగ్రెస్​ సీఎం అభ్యర్థిగా ప్రియాంకను ప్రకటించలేదు.''

- ప్రశాంత్​ కిశోర్​, ఎన్నికల వ్యూహకర్త

పట్నాలో రాహుల్​ను(Rahul Gandhi news) తొలిసారి కలిశానని, అప్పుడే తనను కాంగ్రెస్​ కోసం పనిచేయమని అడిగినట్లు చెప్పుకొచ్చారు పీకే (Prashant kishor). అయితే బిహార్​లో రాజకీయ పరిస్థితులు బాగాలేవని, ముఖ్యంగా కాంగ్రెస్​కు పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారాయని అన్నారు.

ఇదీ చూడండి: రాహుల్​తో పీకే భేటీ- ఆ ఎన్నికలపై చర్చ!

అది తొందరపాటే..

కొద్దిరోజులక్రితం కూడా ప్రశాంత్​ కిశోర్​.. కాంగ్రెస్​పై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్​ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఉదంతంపై ఉద్యమించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలోని ప్రతిపక్ష పాత్ర వేగంగా బలోపేతం అవుతుందని ఆశపెట్టుకోవడం తొందరపాటు అవుతుందని ‌(Prashant Kishor Congress) హెచ్చరించారు. అంతర్గతంగా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్‌ పునరుత్థానం సాధించలేదని చెప్పారు.

దీనికి ఘాటుగా బదులిచ్చిన కాంగ్రెస్​.. లఖింపుర్​ ఖేరి ఘటన వంటి సున్నితమైన అంశాల్లో లాభనష్టాలను వెతుక్కోవడం నేరమని పేర్కొంది.

కష్టమే..

పీకే.. కాంగ్రెస్​లో చేరతారని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. పలువురు సీనియర్లు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రశాంత్​ (Prashant kishor) తీరును చూస్తుంటే.. కాంగ్రెస్​లో ఆయన ప్రవేశం ఇక లేనట్లే కనిపిస్తోంది.

రాహుల్​కు పగ్గాలు?

వచ్చే ఏడాది జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్​ పార్టీ.. వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. రాహుల్​ గాంధీ(Rahul Gandhi news) మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని.. శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పలువురు సీనియర్లు కోరారు. ఆయన కూడా దీనిపై ఆలోచిస్తానని సానుకూలంగానే స్పందించారు. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చూడండి: Cwc Congress: 'ఆ చట్టాల కోసం అందరినీ నరకయాతన పెట్టారు'

ఆ నియోజకవర్గంలో పీకేకు ఓటు- రెండు పార్టీల మాటల యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.