ETV Bharat / bharat

బ్లాక్​ ఫంగస్ రూపంలో కొత్త సవాల్​: మోదీ

author img

By

Published : May 21, 2021, 12:35 PM IST

Updated : May 21, 2021, 2:11 PM IST

కరోనా కట్టడిలో ఉత్తర్​ప్రదేశ్​ వారణాసి నగరం.. గొప్ప ఉదాహరణగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే పీటీ రాజన్​ మిశ్రా ఆస్పత్రిని నిర్మించడాన్ని అభినందించారు. వైద్యులకు, ఫ్రంట్​లైన్​ వర్కర్లకు ధన్యవాదుల చెబుతూ.. ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

pm Narendra Modi
ప్రధాని మోదీ

కొవిడ్​ మహమ్మారిని ఎదుర్కోవటంలో ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసి నగరం గొప్ప ఉదాహరణగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే.. పీటీ రాజన్​ మిశ్రా ఆస్పత్రిని నెలకొల్పడం సహా నగరవ్యాప్తంగా ఆక్సిజన్​, ఐసీయూ పడకలను ఇక్కడి అధికారులు ఏర్పాటు చేశారని ప్రశంసించారు. వారణాసిలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో ఆయన వర్చువల్​గా సమావేశమయ్యారు.

ఇప్పటికే.. కరోనా ఫ్రంట్​లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్​ అందిస్తాం. కరోనాపై పోరాడుతున్న సమయంలో బ్లాక్​ ఫంగస్​ రూపంలో మరో కొత్త సవాలు మనకు ఎదురైంది. ఈ వ్యాధి బారిన పడకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలి, సమర్థంగా ఎదుర్కోవాలి.

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

కరోనా రెండో దశ విజృంభణతో ఆరోగ్య వ్యవస్థపై అధిక భారం పడిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులకు, ఫ్రంట్​లైన్​ వర్కర్లు ధన్యవాదాలు చెబుతూ.. మోదీ ఈ సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. కరోనాకు వ్యతిరేకంగా మనమంతా ఇంకా చాలా కాలం పాటు పోరాడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Last Updated : May 21, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.