ETV Bharat / bharat

'మా పాలనలో లక్షాధికారులైన 3 కోట్ల మంది పేదలు'

author img

By

Published : Oct 5, 2021, 2:25 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో 75 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను డిజిటల్​గా అందజేశారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi News). 'ఆజాదీ@75' కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద వీళ్లందరికీ ఇళ్లు మంజూరు చేశారు.

75వేల మందికి ఇళ్ల తాళాలు అందజేసిన మోదీ

ఉత్తర్​ప్రదేశ్​లో గత ప్రభుత్వాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi News). పేద ప్రజలకు సొంతిల్లు నిర్మించాలనే చిత్తశుద్ధి వారికి లేదన్నారు. లఖ్​నవూలో 'ఆజాదీ@75-న్యూ అర్బన్ ఇండియా' కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. యూపీలోని 75 జిల్లాలకు చెందిన 75వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను డిజిటల్​గా అంజేశారు. ప్రధానమంత్రి ఆవాస్​ యోజన కింద వీరందరికీ ఇళ్లు మంజూరయ్యాయి.

" 2017కు ముందు యూపీలో ఇళ్ల నిర్మాణం కోసం రూ.18వేల కోట్లు మంజూరయ్యాయి. కానీ 18 ఇళ్లు కూడా నిర్మించలేకపోయారు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్​ 9 లక్షల ఇళ్లను నిర్మించింది. మరో 14 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎన్​డీఏ ప్రభుత్వం 3 కోట్ల మంది పేదలను లక్షాధికారులుగా మార్చింది."

--ప్రధాని మోదీ.

ఈ కార్యక్రమంలో మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​, యూపీ సీఎం ఆదిత్యనాథ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పాల్గొన్నారు.

యూపీ పర్యటనలో భాగంగా అయోద్య అభివృద్ధి మాస్టర్​ప్లాన్ గురించి కూడా మోదీ ఆరా తీశారు.

ఇదీ చదవండి: అబ్బాయికి హెలికాప్టర్.. బాబాయికి కుట్టుమిషన్.. లెక్క తేల్చిన ఈసీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.